బీఎస్పీ నకిరేకల్ ఇన్ చార్జి ప్రియదర్శిణి మేడి సమస్యలు పరిష్కరించాలంటూ స్థానికులతో కలసి ధర్నా సామాజిక సారథి, చిట్యాల: నకిరేకల్ నియోజక వర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి మేడి ప్రియదర్శిణి ఆరోపించారు. చిట్యాలలోని సుందరయ్య నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను ఆమె సోమవారం పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే కాలనీలో సమస్యలు పరిష్కారం కావడంలేదని స్థానిక ప్రజలతో కలిసి ఆమె ధర్నా చేశారు. […]