సామాజిక సారథి, ఏటూరు నాగారం: పీఎల్జీఏ 21వ వార్షిక వారోత్సవాలు డిసెంబర్ 2నుంచి డిసెంబర్10 వరకు జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ సరిహద్దు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలతో అడవులను జల్లడ పడుతున్నారు. రహదారులు, గోదావరి పరీవాహక ప్రాంతాలపై డేగ కన్నుతో సోదాలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి మావోయిస్టులు వారి ఉనికిని చాటుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం […]
సారథి, రామాయంపేట: కొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది. సంతోషాల మధ్య శుభకార్యం జరగాల్సిన ఆ ఇంటిలో చావు డప్పు మోగింది. పుస్తెమట్టెలను తీసుకొచ్చేందుకు వెళ్లిన పెళ్లికొడుకు తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని 44వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం.. పులిమామిడి గ్రామానికి చెందిన మందపురం రాజయ్య(55) చిన్నకుమారుడు గణేష్ వివాహం నగరం గ్రామంలో జరగాల్సి ఉంది. పులిమామిడి నుంచి రామాయంపేటకు వచ్చి పుస్తెమట్టెలు […]