Breaking News

MUMBAI

సరోజ్​ఖాన్​ ఇకలేరు

దిగ్జజ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ (71) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతిచెందారు. గతనెల 20న ఆమె శ్వాసకోసం ఇబ్బందులతో ముంబైలోని గురునానక్​ దవాఖానలో చేరారు. అనంతరం ఆమె పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జి చేశారు. ఇంతలోనే ఆమె కన్నుమూయడంతో బాలీవుడ్​ సినీపరిశ్రమలో విషాదం నెలకొన్నది. సరోజ్​ఖాన్​ దాదాపు రెండువేల పాటలకు సరోజ్​ఖాన్​ కొరియోగ్రాఫ్​ అందించారు. దేవదాస్​లోని డోలారే డోలాకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. శ్రీదేవి నటించిన […]

Read More

జీవీకే కృష్ణారెడ్డిపై సీబీఐ కేసు

సారథిన్యూస్​, హైదరాబాద్​: జీవీకే గ్రూప్​ అధినేత జీవీ కృష్ణారెడ్డి, అతడి కుమారుడు సంజయ్​రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణలో వీరు అవకతవకలకు పాల్పడ్డట్టు వీరిపై అభియోగాలు ఉన్నాయి. దాదాపు రూ. 705 కోట్ల మేర వీరు అక్రమాలకు పాల్పడ్డట్టు సమాచారం. ముంబై విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ కోసం జీవేకే సంస్థ మియాల్​తో ఒప్పందం కుదుర్చుకున్నది. కాగా 2017లో బోగస్​ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చినట్టు చూపించి నిధులను దారి మళ్లించినట్టు సమాచారం.

Read More

వరవరరావు బెయిల్ పిటిషన్‌‌ నిరాకరణ

ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు నిరాకరించింది. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్‌ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టైన […]

Read More

సెలూన్లు ఓపెన్​

ముంబై : మహారాష్ట్రలో సెలూన్లు ఓపెన్​ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. క‌రోనా కార‌ణంగా మూడు నెల‌ల నుంచి సెలూన్లను మూసివేశారు. దీంతో సెలూన్​ నిర్వాహకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే 12 మంది బార్బర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో జూన్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు తెరిచేందుకు ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. గురువారం జ‌రిగిన స‌మీక్ష‌లో కేబినెట్ దీనికి ఆమోద‌ముద్ర తెలిపిందని మంత్రి విజయ్ తివార్ తెలిపారు. […]

Read More

ముంబై ఐఐటీలో క్లాసులు బంద్​

ముంబై : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఐటీ ముంబై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం నుంచి కేవలం ఆన్​లైన్​ క్లాసులను మాత్రమే నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని దాతలను కోరింది. వారు ఆన్‌లైన్‌ చదువులు కొనసాగించటానికి అవసరమైన ల్యాప్‌టాప్స్‌, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవసరమవుతాయని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విన్నవించింది.

Read More

ఢిల్లీలో కరోనా రెస్పాన్స్‌ ప్లాన్‌

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక కేసులు నమోదై.. మహారాష్ట్ర తర్వాతి ప్లేస్‌లో ఉన్న ఢిల్లీలో కరోనా అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తలు చేస్తోంది. ఈ మేరకు కరోనా వైరస్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ను అధికారులు రివైజ్‌ చేశారు. దాంట్లో భాగంగానే జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంట్లో కరోనా టెస్టులు నిర్వహించాలని ప్లాన్‌ చేసుకున్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఈనెల 30 నాటికి స్క్రీనింగ్‌ కంప్లీట్‌ చేయాలని టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్‌కు సంబంధించి ఈ […]

Read More

సుశాంత్​ మృతి బాధించింది

ముంబై : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌‌ ఆత్మహత్య తనను ఎంతో బాధించిందని శృంగార తార సన్నీలియోన్‌ పేర్కొన్నది. దీని గురించి ఏం రాయాలో.. ఏం స్పందించాలో తెలియడం లేదు అంటూ ట్విట్టర్​లో ఓ లేఖను విడుదల చేసింది. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారమని తాను భావించడం లేదని ఆ లేఖలో పేర్కొన్నది.

Read More

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పూత్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ‘కోయ్‌ పో చి’ సినిమాతో సుశాంత్​ బాలీవుడ్లో తెరంగేట్రం చేశాడు. తర్వాత శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌, పీకే, డిటెక్టీవ్‌ బొమ్‌కేష్‌ బక్షి, ఎంఎస్‌ ధోని, ద అన్‌టోల్డ్‌ స్టోరీ, రాబ్టా, వెల్‌కమ్‌ న్యూయార్క్‌, కేదార్‌నాథ్‌, సోంచారియా, చిచ్చోర్‌, డ్రైవ్‌ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. అలాగే సుషాంత్​కు బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా మంచి పేరు […]

Read More