Breaking News

MULUGU

మూరుమూరులో ‘ఫ్రై డే.. డ్రై డే’

మూరుమూరులో ‘ఫ్రై డే.. డ్రై డే’

సారథి న్యూస్, వాజేడు: వానాకాలంలో నిల్వ ఉన్న నీటితో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండలం మూరుమూరు పంచాయతీలో ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ పూసం నరేష్, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, శేఖర్, కన్యాకుమారి, ఛాయాదేవి, లలిత కుమారి, అంగన్​వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
టేకులగూడెంలో కరోనా టెస్టులు

టేకులగూడెంలో కరోనా టెస్టులు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా పేరూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని టేకులగూడెంలో డాక్టర్ సీతారామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 61మందికి వైద్యపరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్​ రిపోర్టు వచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వ్యాధి నిర్ధారణ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఫార్మసిస్ట్ యాలం సతీశ్, హెల్త్ అసిస్టెంట్ కె.తిరుపతి రావు, ఎస్ఎన్ఎం జి.రజిత, ఎల్టీకే.అశ్విని, సర్పంచ్ వాసం కృష్ణవేణి, కార్యదర్శి యాలం వినోద పాల్గొన్నారు.

Read More
మహిళలు స్వశక్తితో ఎదగాలి

మహిళలు స్వశక్తితో ఎదగాలి

సారథి న్యూస్, వాజేడు(ములుగు): మహిళలు స్వశక్తితో ఎదగాలని సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. తస్లీమా చిన్నకుమారుడు సుహాన్ పుట్టినరోజు కానుకగా బుధవారం నిరుపేద మహిళ సంగి ఉమకు కుట్టు మిషన్ అందించి దాతృత్వం చాటుకున్నారు. కరోనా సమయంలో ఏదైనా వేడుకలు చేసుకోలేకపోతున్న వారు పేదలకు ఏదైనా దానం చేసి దాతృత్వం చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, డాక్టర్​సంతోష్, సర్వర్ ఫౌండేషన్ సభ్యులు మామిడిపల్లి రమేష్, చంటి శామ్యూల్, అస్మా, […]

Read More
మహిళలు, బాలికలకు అండగా సఖి కేంద్రం

మహిళలు, బాలికలకు అండగా సఖి కేంద్రం

సారథి న్యూస్, ములుగు: సఖి కేంద్రాలు మహిళలు, బాలికలకు అండగా నిలవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో సఖి జిల్లా నిర్వహణ కమిటీ, జిల్లా బాలసంరక్షణ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహహింస, లైంగిక హింసలను ఎదుర్కొనే మహిళలు, బాలికలకు రక్షణ, న్యాయ, వైద్య సహాయాలు అందుతాయని అన్నారు. జిల్లాలో మార్చి 8న సఖి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో […]

Read More
ఈ-ఆఫీస్ ద్వారానే ఫైళ్లు

ఈ-ఆఫీస్ ద్వారానే ఫైళ్లు

సారథి న్యూస్, ములుగు: కార్యాలయ ఫైళ్లను ఈ-ఆఫీస్ ద్వారానే సమర్పించాలని, మ్యానువల్ ఫైళ్లు పరిశీలించబోమని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ-ఆఫీస్ ద్వారా పాలనకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులందరికీ వారి వారి లాగిన్ ఐడీలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయా శాఖల అధికారులంతా సెక్షన్ల వారీగా కరంట్ ఫైళ్లు, ముగింపు ఫైళ్ల వివరాలు సమర్పించాలన్నారు. కార్యాలయంలో నిర్వహించనున్న ఫైళ్ల వివరాలను స్కాన్ […]

Read More
దోమ తెరలు పంపిణీ

దోమ తెరలు పంపిణీ

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీ, మండపాక గ్రామాల్లో వాజేడు వైద్యబృందం ఆధ్వర్యంలో దోమ తెరలను పంపిణీ చేశారు. అనంతరం ‘ఫ్రై డే.. డ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. మెడికల్​ ఆఫీసర్​ మంకిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మాస్కులు కట్టుకుని, భౌతికదూరం పాటించాలని, జలుబు, దగ్గు, జ్వరం ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ […]

Read More
ములుగు.. జలసంద్రం

ములుగు.. జలసంద్రం

మేడివాగులో ఇద్దరు మత్స్యకారుల గల్లంతు హైవేపైకి చేరిన రామప్ప సరస్సు నీరు సారథి న్యూస్​, ములుగు: ములుగు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో జిల్లా జలసంద్రంగా మారింది. జిల్లాలోని జంగాలపల్లి గ్రామం వద్ద హైవేపైకి రామప్ప సరస్సు నీరు చేరుకోవడంతో ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి ములుగులోనే నిలిపివేస్తున్నారు.ఇద్దరు గల్లంతుజంగాలపల్లి వద్ద నేషనల్​ […]

Read More
వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లాలో వరుసగా కురుస్తున్న భారీవర్షాలకు మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పర్యటించారు. ఏటూరు నాగారంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి బాధితులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఓ మహిళ తన కొడుకు పక్షవాతంతో దవాఖానలో చేరాడని, వైద్యానికి డబ్బులు లేవనడంతో వెంటనే అతడికి మంచి వైద్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తన వ్యక్తిగతంగా […]

Read More