సారథి న్యూస్, మిడ్జిల్: సాధారణంగా అన్ని గ్రామాల మాదిరిగానే ఆ ఊరులోనూ ఎక్కువగా వలస వెళ్లి బతికే కూలీలు, కార్మికులు ఉంటారు. కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడెక్కడ ఉన్నవారంతా తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నారు. దీంతో ఏ ఇల్లూ చూసినా ఇంటిల్లిపాదితో కళకళలాడుతోంది. ఆ గ్రామంలో ఏ పండుగనైనా కలిసిమెలిసే జరుపుకుంటారు. అయితే గ్రామస్తులంతా పెద్దఎత్తున జరుపుకునే వేడుకల్లో పీర్ల పండగ ఒకటి. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొహర్రం తర్వాత ఈ గ్రామంలో నిశ్శబ్దం ఆవహించింది. […]
సారథి న్యూస్, రామగుండం: మొహర్రం త్యాగాలకు ప్రతీక అని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం అంతర్గాం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ కౌన్సిలర్ అంజలి తల్లి మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదారారు. అనంతరం అలీ కుటుంబాన్ని పరామర్శించారు, ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ అమ్ముల నారాయణ, జహిద్ బాషా ఉన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఈ నెలాఖరులో వస్తున్న మొహర్రంపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్రహోంశాఖ మంత్రి మహమూద్ అలీ డీఎస్ఎస్ భవన్ లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్ బాషాఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ […]