Breaking News

MLC ELECTIONS

ఓటు వేసిన కేటీఆర్​

ఓటు వేసిన కేటీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లోని షేక్​పేట తహసీల్దార్​కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కే.తారక రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్​లో నిలబడి ఓటు వేసి అందరిలోనూ ఉత్సాహం నింపారు.

Read More
ములుగు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

ములుగు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

సారథి న్యూస్, ములుగు: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.కృష్ణ ఆదిత్య తెలిపారు. ఆదివారం శాసనమండలి ఎన్నికల పోలింగ్ సరళిని ములుగు, వెంకటాపురం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎన్నికల కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలో మొత్తం పోలైన ఓట్లలో పురుషులు 5,705 మంది, స్త్రీలు 2,489 మంది వేశారని, పోలింగ్ శాతం […]

Read More
ఓటు వేసిన ప్రముఖులు

ఓటు వేసిన ప్రముఖులు

సారథి న్యూస్, అలంపూర్​: ఇటిక్యాల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పోలింగ్​కేంద్రంలో అలంపూర్​ఎమ్మెల్యే డాక్టర్​వీఎం అబ్రహం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఇక్కడే మాజీ ఎంపీ మందా జగన్నాథం ఓటు వేశారు. మానవపాడు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్​ సరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానవపాడు పోలింగ్ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పరిశీలించారు.

Read More
చిన్నారెడ్డి గెలుపు ఖాయం

చిన్నారెడ్డి గెలుపు ఖాయం

సారథి న్యూస్​, యాచారం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలువుకోసం విశేషంగా కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కృష్ణాజలాల సాధనకు సీపీఎంతో కలిసి పోరాడి సాధించామని గుర్తుచేశారు. జడ్పీటీసీ నిత్యా నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
జాగ్రత్తగా ఎన్నికల డ్యూటీ చేయాలే

జాగ్రత్తగా ఎన్నికల డ్యూటీ చేయాలే

సారథి న్యూస్, ములుగు: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రెండవ విడత ట్రైనింగ్​ ఇచ్చారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, సహాయ ఎన్నికల అధికారి కె.రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్, పెద్ద బ్యాలెట్ బాక్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ డ్యూటీని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, డీఏవో శ్రీనివాస్, […]

Read More
నిరుద్యోగ భృతి కోసం నిరాహార దీక్ష

నిరుద్యోగ భృతి కోసం నిరాహార దీక్ష

సారథి న్యూస్, అయిజ(మానవపాడు): నిరుద్యోగ భృతి కోసం నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు కాంగ్రెస్​ఓబీసీ సెల్​రాష్ట్ర కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారి తెలిపారు. సోమవారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్​ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్​ఉద్యోగులంతా తిండి తిప్పలు మాని ఇబ్బందులు పడుతుంటే, కూటికి గడవక కూలికిపోతుంటే చోద్యంచూసిన టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల రాగానే […]

Read More
చిన్నారెడ్డి గెలుపునకు కృషిచేయాలి

చిన్నారెడ్డి గెలుపునకు కృషిచేయాలి

సారథి న్యూస్, మానవపాడు: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీమంత్రి, జి.చిన్నారెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ యూత్ యువ నాయకుడు వేల్పుల రవి కోరారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంచి జరగాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు జి.చిన్నారెడ్డికి వేయాలని కోరారు. కార్యక్రమంలో వేల్పుల రవి, మురళిగౌడ్, నేతాజీ గౌడ్, మాజీ సర్పంచ్ సుంకన్న, […]

Read More
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ పీఆర్సీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటుందని ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వత్​రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ములుగు ఎస్టీయూ భవన్లో అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ అధ్యక్షతన జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీ, మోడల్ స్కూలు టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ముందుండి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎస్టీయూ మద్దతు ప్రకటించించిన […]

Read More