సామాజికసారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన రాయలగండి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎత్తయిన నల్లమల కొండలపై వెలిసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో ఏటా పాల్గుణ శుద్ధపంచమి నాడు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ పాదాలపై పడటం, ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుదూరంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రాంతవాసులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇదీ ఆలయ విశిష్టతదళితులే […]
సామాజిక సారథి, అచ్చంపేట: సోషల్ మీడియాలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు విచారణకు పిలిచారు. ఇది కాస్తా అదే సోషల్ మీడియాలో వైరల్గా మారడం పోలీసులకు తలనొప్పిగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన హుజారాబాద్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ గెలవకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు ఓ టీవీ ఛానల్ చర్చలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, దీని గురించి […]
సారథి, అచ్చంపేట: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విజ్ఞప్తి మేరకు స్థానిక సివిల్ ఆస్పత్రికి నాలుగు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు స్పోటన్ లాజిస్టిక్ సంస్థ వారు, అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి, డీఎంహెచ్ వో డాక్టర్ కె.సుధాకర్ లాల్ చేతులమీదుగా మంగళవారం అందజేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించగలమని డీఎంహెచ్ వో అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, స్పోటన్ లాజిస్టిక్స్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ […]
సారథి న్యూస్, అచ్చంపేట: మహాశివరాత్రి సందర్భంగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమలలోని భౌరాపూర్ చెంచుపెంటలో భ్రమరాంబదేవి, మల్లిఖార్జున స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ దంపతులు, కలెక్టర్ ఎల్.శర్మన్ దంపతులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని చెంచులు తమ ఆరాధ్యదైవంగా భావించే భ్రమరాంభ, మల్లిఖార్జున స్వామి కల్యాణఘట్టాన్ని జరిపిస్తుంటారు. నల్లమల నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.