జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సారథి, రామాయంపేట: ఈ వర్షాకాలంలో వరిపంటనే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పత్తి, పప్పు దినుసులు, నూనెగింజలను సాగు చేయాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. గురువారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో వానాకాలం పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇచ్చే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు […]
సారథి, రామాయంపేట: నకిలీ సీడ్స్, ఫర్టిలైజర్ గానీ రైతులకు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసునమోదు చేసి జైలుకు పంపిస్తామని నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ ఫర్టిలైజర్ షాప్ దుకాణాల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పలు విత్తన, ఫర్టిలైజర్ షాపులను ఆయన తన సిబ్బందితో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ సీడ్స్ గురించి ఎలాంటి సమాచారం రైతుల దగ్గర ఉన్నా పోలీస్ సిబ్బంది, […]
మెదక్ ఆర్డీవో సాయిరాం సారథి, పెద్దశంకరంపేట: లారీల్లోని ధాన్యం లోడును వెంటనే ఖాళీచేయాలని మెదక్ ఆర్డీవో సాయిరాం ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. ముందుగా స్థానిక పౌరసరఫరాల శాఖ గోదాంలోకి వెళ్లి చూశారు. నిర్ణీత వ్యవధిలోనే సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. వచ్చేనెల బియ్యం డబుల్ కోటా వస్తుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని గోదాం ఇన్ చార్జ్ ప్రదీప్ కుమార్ కు […]
సారథి, చిన్నశంకరంపేట: ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ కిసాన్ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి విమర్శించారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి, కొండాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడి రైతులు, హమాలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తడిసి నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. కొనుగోలు కేంద్రాలు, […]
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని స్వయంభూ ఉమాసంగమేశ్వర దేవాలయం కొప్పోలులో సహాయ అర్చకుడిగా పనిచేసే మనోహర్ రావు జ్వరంతో బాధపడుతున్నాడు. విషయం తెలిసి గురుమదనానంద బ్రాహ్మణ సేవా రుద్రపరిషత్ కన్వీనర్, అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడి చంద్రశేఖర్ ఆలయానికి వెళ్లి ఆయనకు పండ్లు, మందులు, ఇతర ఆహార పదార్థాలు అందజేశారు.
సారథి, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలంలోని వెంకట్రావుపల్లి, మల్లుపల్లి, రుద్రారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ జిల్లా డీఆర్డీవో శ్రీనివాస్ శనివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం డీఆర్డీఏ ఐకేపీ ద్వారా 110 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నేటికీ 14,600 మంది రైతుల నుంచి రూ.123 కోట్ల విలువైన 6.64 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు 12,600 మంది రైతుల ఖాతాల్లో […]
సారథి, పెద్దశంకరంపేట: బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేట మండలంలోని ఉత్తులూర్ గ్రామానికి చెందిన సంగమ్మ కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.50 లక్షల ఎల్ వోసీ చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, వైస్ […]
సారథి, చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి జిల్లాలోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని మెదక్ డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన చిన్నశంకరంపేట మండలంలోని కొరివిపల్లి సంగయ్యపల్లి, కామారం గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా సంతృప్తి వ్యక్తంచేశారు. ఎండాకాలం అయినప్పటికీ మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్న సర్పంచ్ లు, అధికారులను అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ […]