షోకాజ్ నోటీసు జారీ చేసిన వీడని నిర్లక్ష్యం ఈవో పనితీరుపై సర్వత్రా విమర్శలు సామాజిక సారథి, పెద్దశంకరంపేట: గత జూలై 5వ తేదీన పల్లె ప్రగతి పనులను పరిశీలించడానికి పెద్ద శంకరంపేట మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ హరీష్ పెద్దశంకరంపేట పారిశుధ్యంపై పేట పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రత్యేకంగా 161జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రియాంక కాలనీలో మురికి కాలువలో నుండి మురికి నీరు రోడ్డుపై […]
సామాజిక సారథి, సిద్దిపేట: జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ పోచమ్మ అమ్మవారిని మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. గురువారం ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా సుభిక్షంగా ఉండేలా దీవించు తల్లీ అని వేడుకున్నారు. ఈ మేరకు ఆలయ సవిూపంలో ఓ భక్తుడు వేయించిన సదరు పట్నంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట ఎప్డీసీ చైర్మన్ […]
రోడ్డుపైనే వరికుప్పలకు నిప్పు మొలకెత్తిన వడ్లతో నిరసన కాంటా పెట్టినా లారీలు వస్తలేవని ఆక్రందన సామాజిక సారథి, చిలప్ చెడ్: రైతుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెగింది. ధాన్యం తరలింపులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం చిట్కుల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సోమక్కపేట సహకార సంఘం ఆధ్వర్యంలో 10 సెంటర్లు, ఐకేపీ ఆధ్వర్యంలో మరో మూడు ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. […]
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా నాందేడ్– అకోలా హైవేపై పెద్దశంకరంపేట అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ట్రెయినీ ఎస్సై దీక్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల పెండింగ్ చలాన్లను పరిశీలించారు. ప్రతిఒక్కరూ వాహనం నడిపేటప్పుడు ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వారి వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన రంగరి పండరినాథ్ మృతి విషయంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎంపీపీ సంజీవరెడ్డి తనపై చేసిన ఆరోపణలు సరికాదని ఎంపీపీ జంగం శ్రీనివాస్ హితవు పలికారు. బుధవారం పెద్దశంకరంపేటలోని తన నివాసంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పండరినాథ్ మృతి కేసు కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని, అవసరమైతే పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చన్నారు. చట్టాలు ఎవరికీ చుట్టం కాదని పేర్కొన్నారు. కేసు విషయంలో పూర్తివివరాలు తెలుసుకొని […]
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల ఖండ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. పర్యావరణ ప్రముఖ్ గా రవివర్మ, ఖండ వ్యవస్థ ప్రముఖ్ గా వీరప్ప, ఖండ కార్యవాహ్ గా జహిందర్ రెడ్డి, సహ కార్యవాహ్ గా సీతారామరావు, సంపర్క్ ప్రముఖ్ గా కృష్ణమూర్తి, బౌద్ధిక్ ప్రముఖ్ గా సర్వేశ్వర్, ఖండ ముఖ్యకార్యకర్తగా సతీష్ గౌడ్, సేవా ప్రముఖ్ గా విశ్వేశ్వర్ గౌడ్, ఖండ కార్యకర్తగా మల్గొండ మధును నియమించారు.
సారథి, నర్సాపూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసి నాలుగు నెలలు గడిచినప్పటికీ కూలి డబ్బులు రావడం లేదని ఓ కూలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంసాన్‌పల్లిలో చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం మేరకు.. నాలుగు నెలల క్రితం గ్రామానికి చెందిన కూలీలు ఒర్రె లక్ష్మయ్య, దుంపల నరసింహులుతో పాటు మరికొందరు ఉపాధి పనులు చేశారు. పనిచేసి నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో ఎంపీడీవోకు విన్నవించారు. అయినప్పటికీ […]
సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా జడ్పీ సీఈవో వెంకట శైలేష్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట మండలం కమలాపూర్, మాడ్ శెట్ పల్లి గ్రామాల్లో వైకుంఠధామం తదితర అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. వీలైనంత తొందరగా వైకుంఠధామం పనులు, కంపోస్టు ఎరువుల తయారీ తదితర పనులను పూర్తిచేయాలని కోరారు. పల్లెప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించుకునేందుకు ప్రతిఒక్కరూ […]