Breaking News

medak

సాగింది.. ఏరువాక

సారథి న్యూస్, రామాయంపేట: ఏరువాక పౌర్ణమి.. రైతులు పవిత్రంగా జరుపుకునే పర్వదినం. తెలంగాణలో ఎరొక్క పున్నమి అని పిలుస్తారు. ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. వ్యవసాయ పనులను ప్రారంభించే ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జేష్ఠ్య శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తుంటారు. అందులో భాగంగానే ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున ఈ పండుగను రైతన్నలు ఘనంగా జరుపుకుంటారు. వ్యవసాయానికి ఎద్దులే ప్రధాన […]

Read More

నర్సాపూర్​కు కాళేశ్వరం నీళ్లు

సారథి న్యూస్​, నర్సాపూర్​: మెదక్​ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని కొత్తకాలనీ, ఎంపీడీవో, తహసీల్దార్​ ఆఫీసుల ఎదుట వేస్తున్న సీసీరోడ్డు పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే సి.మదన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో సీసీరోడ్లు వేసినట్లు తెలిపారు. త్వరలోనే నర్సాపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా సాగునీరు తీసుకొస్తామన్నారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో కోటిలింగం, కాంట్రాక్టర్ రాజు, పంచాయతీ రాజ్ ఏఈ ప్రభాకర్, ఉపసర్పంచ్ […]

Read More

మెదక్ ఎస్ఈగా కనకరత్నం

సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా కనకరత్నం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన వేణుమోహన్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సిద్దిపేట జిల్లా పంచాయతీరాజ్ ఈఈగా పనిచేస్తున్న కనకరత్నంకు ఎస్ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చీఫ్ ఇంజనీర్(ఈఎన్​సీ) ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు మెదక్ పట్టణంలోని పంచాయతీరాజ్ సర్కిల్ ఆఫీస్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కనకరత్నం గతంలో మెదక్ జిల్లాలో […]

Read More

మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. 28వ తేదీన జిల్లాలోని పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంటకు చెందిన 54ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు టెస్టుల్లో తేలింది. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులను క్వారంటైన్​కు తరలించి, కరోనా లక్షణాలు ఉన్న వారికి టెస్టులు చేశారు. ఈ మేరకు ఆదివారం చేగుంటలో కరోనా సోకిన వ్యక్తి భార్యకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను చికిత్స కోసం […]

Read More

కాల్వల పనులు కంప్లీట్​ చేయండి

సారథి న్యూస్, మెదక్: కొండపోచమ్మ జలాశయానికి గోదావరి జలాలు వచ్చిన నేపథ్యంలో సంగారెడ్డి, రామాయంపేట ప్రాంతాల్లో కాల్వ పనులను తొందరగా పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోమటిబండపై మిషన్ భగీరథ భవన్ లో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వేణుతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణకు […]

Read More

బీజేపీ మెదక్ జిల్లాకు కొత్త సారథి

సారథి న్యూస్, మెదక్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మెదక్ జిల్లాకు గడ్డం శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గడ్డ శ్రీనివాస్ పార్టీలో కార్యకర్తస్థాయి నుంచి జిల్లా అధ్యక్ష స్థాయి వరకు ఎదిగారు. గతంలో ఉమ్మడి మెదక్ మండలాధ్యక్షుడిగా మూడుసార్లు, మెదక్ ఉమ్మడి జిల్లా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. పార్టీకి అందించిన సేవలకు […]

Read More

నమో ఆంజనేయం

భక్తుల కొంగు బంగారంగా సహకార ఆంజనేయ స్వామి పర్యాటకంగా అభివృద్ధిచెందుతున్న ఆలయం సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లా గొట్టిముక్కుల పంచాయతీ చాకలిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. దట్టమైన అరణ్యంలో కొలువైన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది. తూప్రాన్– నర్సాపూర్ మెయిన్​ రోడ్డుకు ఆనుకుని అరణ్యంలో కొలువైన సహకార ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తజనం వస్తుంటారు. కోరిన కోరికలు తీరుతుండడంతో స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఉమ్మడి మెదక్​ […]

Read More
చావులోనూ ఒక్కటిగానే..

చావులోనూ ఒక్కటిగానే..

సారథి న్యూస్, మెదక్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. చావులోనూ ఒక్కటిగానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా సంచనం రేకెత్తించింది. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి(29), కామారెడ్డి జిల్లా మల్లుపల్లికి చెందిన రుచిత(25) నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. విజయ్ కుమార్ అదే గ్రామంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రుచిత అమ్మానాన్నలు రూ.ఆరులక్షల విలువైన బంగారు […]

Read More