సారథి న్యూస్, నర్సాపూర్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మెదక్‌జిల్లా కౌడిపల్లి మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నిజాం పరిపాలన నుంచి విమోచనం పొందిన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర తమ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నాయని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, అసెంబ్లీ కన్వీనర్ రాజేందర్, మండలాధ్యక్షుడు రాకేష్, మండల ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, కుమార్, శాకయ్య, ఇతర కార్యకర్తలు […]
సారథి న్యూస్, కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండల జనరల్‌బాడీ మీటింగ్ వాడీవేడిగా సాగింది. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీపీ అజహరుద్దీన్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యురాలు కవితా అమర్ సింగ్, ఎంపీపీ రాజునాయక్ మాట్లాడుతూ.. మండలంలో ప్రతి డిపార్ట్మెంట్ వారు సమాచారం లేకుండా సమావేశాలు నిర్వహించుకుంటున్నారని, దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఉపాధి హామీ నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న తీరు ప్రజలకు ఏ మాత్రం […]
సారథి న్యూస్, మెదక్: భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని, ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రజాప్రతినిధులు కొనియాడారు. శనివారం మెదక్ కలెక్టరేట్ లో జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత అధ్యక్షతన జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతికి నివాళులర్పిస్తూ.. మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మాజీ […]
సారథి న్యూస్, రామాయంపేట: చిన్ననాటి స్నేహితులు తమ అనుబంధాన్ని చాటుకున్నారు. చనిపోయిన తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. కొంత ఆర్థిక సహాయం అందజేసి మేమున్నామని.. ధైర్యం చెప్పారు. మెదక్‌జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామానికి చెందిన కుమ్మరి బాలరాజు(36) మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ ఘటనతో తమ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న దోస్త్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందించాలని, అదే గ్రామానికి చెందిన మృతుడి ఫ్రెండ్స్ రూ.13,800 జమచేసి మృతుడి భార్యకు అందజేశారు. […]
సారథిన్యూస్, రామాయంపేట: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటను మొగిపురుగు ఆశిస్తున్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు నరేశ్, రవి పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయశాస్త్రవేత్తలు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని జెడ్ చెర్వు, బచ్చురాజ్ పల్లి, నందిగామ గ్రామాల్లో వరిపంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి పంట లో మొగిపురుగు నివారణకు నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడొద్దని సూచించారు. అగ్రిమైసిన్ 0.4 గ్రామ్ లేదా క్లోరిఫైరిఫాస్ 2 ఎం ఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని […]
సారథి న్యూస్, కౌడిపల్లి: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సెప్టెంబర్1 నుంచి ఆన్లైన్ క్లాసెస్ చెప్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సర్కారు ఆశయం గొప్పదే అయినా అందరి ఇళ్లలో టీవీలు లేకపోవడం, టీవీలు ఉన్నచోట సమయానికి కరెంట్ లేకపోవడం పెద్ద సవాల్‌గా మారింది. దీంతో విద్యార్థులు కరెంట్ కోసమే ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి వస్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటాపూర్(ఆర్) గ్రామంలో 100 మంది 10వ తరగతి […]
ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు కరోనా ప్రభావంతో మార్కెట్లన్నీ బంద్ ఇదే అదనుగా రేట్లు పెంచిన కూరగాయల వ్యాపారులు సారథి న్యూస్, నర్సాపూర్: ‘వామ్మో.. గీవేం రేట్లు బిడ్డో. ముట్టకుంటే ధరలు మంట మండుతున్నయ్. ఎట్ల కొనాలే.. ఎట్ల తినాలే..’ ఇది ఓ మహిళ ఆవేదన. ‘జేబు నిండ పైసలు తెస్తేనే గానీ కూరగాయలు సంచి నిండుతలేవ్.. ఉప్పుపప్పులకే అంత బెడితే ఎట్ల బతకాలే. గీ రేట్లు ఎప్పుడు సూడలే’ ఇది ఓ మధ్యతరగతి ఉద్యోగి ఆందోళన. కరోనా […]
సారథి న్యూస్, మెదక్: విద్యార్థులు చదువు, విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆన్లైన్ క్లాసెస్‌ను ప్రతి విద్యార్థి వినేలా చొరవ తీసుకోవాలని సూచించారు. మంగళవారం నుంచి రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో ప్రత్యేక ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్న నేపథ్యంలో మెదక్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఈవో రమేశ్ కుమార్, ఆయా శాఖల అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]