Breaking News

medak

టీఆర్ఎస్​సభ్యత్వ నమోదు

టీఆర్ఎస్​ సభ్యత్వ నమోదు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ ​జిల్లా చిన్నశంకరంపేట మండలంలో టీఆర్ఎస్​ మండలాధ్యక్షుడు పట్లొరీ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదు చేయించారు. మండలంలోని అంబాజీపేట, చందాపూర్ గ్రామాల్లో సభ్యత్వాలు చేయించారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్​లు సాన సాయిలు, పడాల రమాదేవి, శ్రీనివాస్, టీఆర్ఎస్​ గ్రామాధ్యక్షుడు ధ్యాప బాలకిషన్, మ్యాసగల్ల పెంటయ్య, గోపాల్ నాయక్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, […]

Read More
ఆధార్ లింక్ గడువు పెంపు

ఆధార్ లింక్ గడువు పెంపు

సారథి న్యూస్, మెదక్: మొబైల్ కు ఆధార్​ నంబర్​ అనుసంధానం చేసేందుకు మీ- సేవా, ఈ-సేవా కేంద్రాలు మార్చి 31వ తేదీ వరకు రాత్రి 9గంటల వరకు పనిచేస్తాయని మెదక్​ జిల్లా కలెక్టర్ హరీశ్​ తెలిపారు. కోవిడ్-19 వాక్సిన్ వేసుకునేందుకు పేరు నమోదుకు ఆధార్ ఆధారిత మొబైల్ ఓటీపీ ఆవశ్యకత ఉన్నందున ఈ వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు. మీ ఆధార్ కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయడం కోసం ఆధార్ కేంద్రాలతో పాటు […]

Read More
ఇంటి వద్దకే అంగన్​వాడీ సరుకులు

ఇంటి వద్దకే అంగన్​వాడీ సరుకులు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఇంటివద్దకే వెళ్లి నేరుగా అంగన్​వాడీ సరుకులను అందజేస్తామని అల్లాదుర్గం సీడీపీవో భార్గవి తెలిపారు. బుధవారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలోని పూసలగల్లీ, తిరుమలాపూర్ అంగన్​వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజు ఐదుగురు చిన్నారుల బరువు తూకం వేయాలని, అంగన్​వాడీ కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. టీ షాట్ ద్వారా ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు ప్లే ఆక్టివిటీపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్​వాడీ టీచర్లు సరళ, స్వరూప, అనురాధ […]

Read More
రుణాలను సకాలంలో చెల్లించాలి

రుణాలను సకాలంలో చెల్లించాలి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: బ్యాంకుల నుంచి తీసుకున్న స్త్రీనిధి రుణాలను సకాలంలో చెల్లించాలని డీఆర్డీఏ అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య సూచించారు. మంగళవారం మెదక్​జిల్లా చిన్నశంకరంపేట మండల సమాఖ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రతి సంఘం సమావేశాలు నిర్వహించుకోవడం, పొదుపు చేయడం, అంతర్గత అప్పులు ఉండడం, తిరిగి చెల్లింపులు చేయడం, పుస్తక నిర్వహణ సక్రమంగా ఉండటం వంటి పంచసూత్రాలు పాటించాలని సూచించారు. కుటుంబ జీవనోపాధి ప్రణాళిక ప్రకారమే రుణాలు పొంది ఆదాయభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టి ఆదాయం […]

Read More
మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు

మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామశివారులో నూతనంగా ఏర్పాటుకానున్న ఓ కంపెనీకి ప్రభుత్వ అసైన్​మెంట్​ భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని భారతీయ కిసాన్​మోర్చా మెదక్​ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. కామారం గ్రామ సర్పంచ్, కాంట్రాక్టర్ కంపెనీ యాజమాన్యంతో చేతులు కలిపి రాత్రికిరాత్రే మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సంబంధిత వ్యక్తులతో పాటు కంపెనీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. […]

Read More
అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట రైతువేదికలో రైతుబంధు సమితి క్యాలెండర్లను ఎంపీపీ జంగం శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఇన్​చార్జ్ ​వ్యవసాయాధికారి అమృత్ మాట్లాడుతూ.. పంటల మార్పిడిలో భాగంగా రైతు సోదరులు అపరాల పంటలైన మినుములు, పెసళ్లు, నూనెగింజల పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు పూలు వంటి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. పంటలకు అడవి పందుల భయం ఉన్నట్లయితే ఆ గ్రామసర్పంచ్​కు ఫిర్యాదు చేయాలని, శిక్షణ ఉన్న షూటర్ సహాయంతో అడవి పందులను చంపివేస్తామని తెలిపారు. […]

Read More
ఘనంగా రమాబాయి జయంతి

ఘనంగా రమాబాయి జయంతి

సారథి న్యూస్, రామాయంపేట/ పెద్దశంకరంపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​బీఆర్​ అంబేద్కర్​సతీమణి రమాబాయి అంబేద్కర్​జయంతి వేడుకలను మెదక్​జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో ఉపసర్పంచ్ కొమ్మట బాబు ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బెల్ల సిద్ధరాములు, గుడ్ల మల్లేశం, సందీప్, సురేష్, మహేష్, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. అలాగే పెద్దశంకరంపేట మండల కేంద్రంలో బహుజన సంఘాల ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర […]

Read More
15వరకు ఓపెన్​ స్కూల్​ అడ్మిషన్ల గడువు

15 వరకు ఓపెన్​ స్కూల్​ అడ్మిషన్ల గడువు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఓపెన్ స్కూళ్ల అడ్మిషన్ల గడువు ఈనెల 15వ తేదీ వరకు ఉందని, బడి మధ్యలో చదువును ఆపివేసిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్​ స్కూల్​ జిల్లా కోఆర్డినేటర్​ వెంకటస్వామి కోరారు. శనివారం వారు పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో యాదగిరి, జడ్పీ హైస్కూలు చిన్నశంకరంపేట కోఆర్డినేటర్ అర్చన, రాములు, ఉపాధ్యాయులు శ్రీకాంత్, రాజ్ కుమార్​, నాగరాజు, సరిత పాల్గొన్నారు.

Read More