నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వార్షిక నివేదికను ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ సామాజికసారథి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నాలుగు శాతం నేరాలు పెరిగాయి. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో కేసుల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు చేసిన […]
మహేశ్ అభిమానులకు ‘సర్కార్‌వారిపాట’ చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్టు సమాచారం. మహేశ్ భర్త్‌డే సందర్భంగా ఈనెల 9న చిత్రయూనిట్ టైటిల్ ట్రాక్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కీర్తీ సురేశ్‌తోపాటు , మరో కథానాయిక కూడా మహేశ్‌తో ఆడిపాడనున్నది. దీంతో పాటు మహేశ్ భర్త్‌డే సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళితో చేయబోయే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.
‘సర్కార్‌వారి పాట’ చిత్రంలో మహేశ్‌బాబుతో కీర్తి సురేశ్ జతకట్టనున్నది. ఇన్‌స్టా లైవ్‌లో కీర్తీ సురేశ్ తన అభిమానులతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మహానటి సినిమాతో కీర్తి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.