Breaking News

MAHARASHTRA

తవ్వకాల్లో బయటపడ్డ భారీ శివలింగం

తవ్వకాల్లో బయటపడ్డ భారీ శివలింగం

సామాజిక సారథి, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని షోలాపూర్‌ లోని హరిహరేశ్వర్ ఆలయంలో తవ్వకాల్లో ప్రత్యేకమైన శివలింగం లభ్యమైంది. ఈ లింగం అత్యంత అరుదైన బహుముఖ శివలింగం కనుగొనబడింది. పాణమట్టంమీద ఇతర దేవతలతో పాటు 359 శివుని ముఖాలను కలిగి ఉంది. దాని బరువు 4000కిలోలు ఉండడంతో భక్తులు తండోపతండాలు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ, స్వయంభూవుడిని దర్శించుకుంటున్నారు.

Read More

రియా జవాబులకు సీబీఐ షాక్​!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసులో రియాచక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తుంది. కాగా రియాచక్రవర్తిని సీబీఐ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు రియా తడబడ్డట్టు సమాచారం. రియా చెబుతున్న సమాధానాలతో సీబీఐ అధికారులే షాక్​కు గురవుతున్నారట. అక్కడ ఆమె ప్రతి ప్రశ్నకు నాకేం తెలియదు అని సమాధానం చెబుతుండటంతో ఆమె నటనకు షాక్​ అవుతున్నారట. ముఖ్యమైన ప్రశ్నలన్నింటికి ఆమె […]

Read More
యువనటుడు అశ్​తోష్​ బక్రే

మరో యువనటుడు సూసైడ్​

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్​ సూసైడ్​ ఘటనను మరువకముందే.. మరో యువ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరాఠీ యువ నటుడు అశుతోష్​ భక్రే (32) గురువారం నాంధేడ్​లోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని మృతికి గల కారణాలు తెలియరాలేదు. 2016లో ఆయన టీవీ నటి మయూరీ దేశ్​ముఖ్​ను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా పలు మరాఠా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరినీ చిత్రపరిశ్రమ మేడ్​ ఫర్​ ఈచ్ ​అదర్​గా అభివర్ణించేవారు. ఈ ఘటనపై […]

Read More
మహారాష్ట్రలో పోలీసులకు కరోనా

138 మంది పోలీసులకు కరోనా

ముంబై: మహారాష్ట్రలో గత 24 గంటల్లో 138 మంది పోలీసులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో పోలీస్​శాఖలో 8,722 మందికి కరోనా సోకింది. ఇందులో 6,670 మంది పోలీసులు కోలుకోగా మరో 1,955 యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 97 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీస్​శాఖ అధికారులు చెప్పారు.

Read More

కిక్కు కోసం శానిటైజర్​ తాగి..

నాగ్‌పూర్‌: మద్యం దొరకలేదని శానిటైజర్​ తాగిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్​పూర్​కు చెందిన గౌతమ్​ గోస్వామి (45) స్థానిక మున్సిపాలిటీలో క్లీనింగ్​ వర్కర్​గా పనిచేస్తున్నాడు. మద్యం దొరకపోవడంతో శానిటైజర్​ తాగితే కిక్కు వస్తుందని భావించిన గోస్వామి తన ఇంట్లో ఉన్న శానిటైజర్​ను తాగాడు. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యలు చికిత్సచేసి పంపించారు. రెండ్రోజుల అనంతరం ఆరోగ్యం క్షీణించి మృతిచెందాడు.

Read More

సెలూన్లు ఓపెన్​

ముంబై : మహారాష్ట్రలో సెలూన్లు ఓపెన్​ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. క‌రోనా కార‌ణంగా మూడు నెల‌ల నుంచి సెలూన్లను మూసివేశారు. దీంతో సెలూన్​ నిర్వాహకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే 12 మంది బార్బర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో జూన్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు తెరిచేందుకు ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. గురువారం జ‌రిగిన స‌మీక్ష‌లో కేబినెట్ దీనికి ఆమోద‌ముద్ర తెలిపిందని మంత్రి విజయ్ తివార్ తెలిపారు. […]

Read More