సారథి న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీనగర్లోని శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి కన్న కొడుకుని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వరకట్పల్లికి చెందిన శంకరయ్య, మమత దంపతులు కొంత కాలంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన కాలనీలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు రియాన్ష్(3) ఉన్నాడు. సోమవారం రాత్రి మమత కుమారుడి చేతిని గాయపరిచి అనంతరం మూడంతస్తుల భవనం పైనుంచి దూకి అత్మహత్యకు పాల్పడింది. తీవ్ర […]
సారథి న్యూస్, ఎల్బీ నగర్: సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు ప్రత్యేక పథకాలు అమలుచేస్తున్నట్లు ప్రకటించడం సంతోషకరంగా ఉందని చేనేతకార్మిక సంఘం ఎల్బీ నగర్ అధ్యక్షుడు చెర్కుస్వామి నేత అన్నారు. శనివారం ఎల్బీ నగర్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈనెల 19న ‘చేనేతకు చేయూత’పథకంతో చేనేతలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా జీవోను తీసుకురావడం సంతోషకరంగా ఉందన్నారు. దీంతో చేనేతల ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు లబ్ధిపొందేలా రూపొందించారని […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కొత్తపేట డివిజన్ లో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు లింగాల కిషోర్ గౌడ్, ఎల్బీనగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జైపాల్, చైతన్యపురి డివిజన్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 78మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, హ్యాండ్ గ్లౌసులు, పండ్లు, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి డీసీసీ […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: భారత్, చైనా సైనికుల ఘర్షణలో అమరుడైన కల్నాల్ సంతోష్ బాబు, ఇతర అమర సైనికులకు బీజేపీ మన్సురాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వలిశెట్టి మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సహారా ఎస్టేట్ చౌరస్తాలోని వివేకానంద విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో కడారి యాదగిరి యాదవ్, మన్సురాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు పాతూరి శ్రీధర్ గౌడ్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేవరకొండ లింగాచారి, వేణు గౌడ్, బీజేవైఎం మన్సురాబాద్ డివిజన్ సంద […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: మూసినది ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం ఉదయం నాగోల్ బ్రిడ్జి ప్రక్కన పరీవాహక ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. మూసినది చుట్టూ నీళ్లు నిరంతరం ప్రవహించే విధంగా ఛానెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువు చుట్టుపక్కల పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించాలని, చెరువు నందు మొలిచిన గుఱ్ఱపు డెక్కను కూడా వెంటనే తొలగించాలన్నారు. మూసినది […]
సారథి న్యూస్,రంగారెడ్డి: లాక్ డౌన్ నేపథ్యంలో మూసి ఉంచిన కరాటే శిక్షణ కేంద్రాలను నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎల్బీనగర్ నియోజకవర్గం కరాటే మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీవీ శ్రీరాములు, ఆర్గనైజర్స్ పి.శ్రీశైలం యాదవ్, జి.నాగరాజు లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సోమవారం కర్మన్‌ఘాట్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కరాటే మాస్టర్లు మీటింగ్ నిర్వహించారు. ఈ శిక్షణ కేంద్రాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మాస్టర్స్ తమ జీవనోపాధి కోల్పోయారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ పెనుభారంగా మారిందని, […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: లాక్ డౌన్ సందర్భంగా తెలంగాణలో జిమ్ సెంటర్ల నిర్వహణను పునరుద్ధరించాలని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జిమ్ ఓనర్ల అసోసియేషన్ సభ్యులు ఆదివారం అడాల యాదగిరి, అడాల శ్రీను ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో ప్రతినెలా జిమ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు, మెయింటనెన్స్, ఎక్యూప్మెంట్ ఈఎంఐలు, కరెంట్ బిల్లులు, ఏసీ బిల్లులు కలుపుకోని రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తుందన్నారు. జిమ్ సెంటర్లు బంద్ చేసినప్పటికీ ఉద్యోగులకు తప్పకుండా వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. […]