Breaking News

KOUDIPALLY

‘ఉపాధి’ కూలీ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

‘ఉపాధి’ కూలీ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

సారథి, నర్సాపూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసి నాలుగు నెలలు గడిచినప్పటికీ కూలి డబ్బులు రావడం లేదని ఓ కూలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం కంసాన్​పల్లిలో చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం మేరకు.. నాలుగు నెలల క్రితం గ్రామానికి చెందిన కూలీలు ఒర్రె లక్ష్మయ్య, దుంపల నరసింహులుతో పాటు మరికొందరు ఉపాధి పనులు చేశారు. పనిచేసి నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో ఎంపీడీవోకు విన్నవించారు. అయినప్పటికీ […]

Read More
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలె

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలె

సారథి న్యూస్, నర్సాపూర్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాలని డిమాండ్​చేస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మెదక్​జిల్లా కౌడిపల్లి మండల తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. నిజాం పరిపాలన నుంచి విమోచనం పొందిన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర తమ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నాయని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, అసెంబ్లీ కన్వీనర్ రాజేందర్, మండలాధ్యక్షుడు రాకేష్, మండల ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, కుమార్, శాకయ్య, ఇతర కార్యకర్తలు […]

Read More
జనరల్​బాడీ మీటింగ్.. గరం గరం

జనరల్​బాడీ మీటింగ్.. సభ్యుల గరంగరం

సారథి న్యూస్, కౌడిపల్లి: మెదక్ ​జిల్లా కౌడిపల్లి మండల జనరల్​బాడీ మీటింగ్ ​వాడీవేడిగా సాగింది. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీపీ అజహరుద్దీన్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యురాలు కవితా అమర్ సింగ్, ఎంపీపీ రాజునాయక్ మాట్లాడుతూ.. మండలంలో ప్రతి డిపార్ట్​మెంట్ ​వారు సమాచారం లేకుండా సమావేశాలు నిర్వహించుకుంటున్నారని, దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఉపాధి హామీ నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న తీరు ప్రజలకు ఏ మాత్రం […]

Read More
కరెంట్​లేదు.. ఫోన్లు లేవు.. పాఠం ఎట్ల సార్లూ!

కరెంట్​ లేదు.. ఫోన్లు లేవు.. పాఠం ఎట్ల సార్లూ!

సారథి న్యూస్, కౌడిపల్లి: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సెప్టెంబర్​1 నుంచి ఆన్​లైన్ ​క్లాసెస్ ​చెప్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సర్కారు ఆశయం గొప్పదే అయినా అందరి ఇళ్లలో టీవీలు లేకపోవడం, టీవీలు ఉన్నచోట సమయానికి కరెంట్​ లేకపోవడం పెద్ద సవాల్​గా మారింది. దీంతో విద్యార్థులు కరెంట్ ​కోసమే ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి వస్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటాపూర్(ఆర్) గ్రామంలో 100 మంది 10వ తరగతి […]

Read More
ఏది ముట్టుకున్నా.. మంట మండుతోంది

ఏది ముట్టుకున్నా.. మంట మండుతోంది

ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు కరోనా ప్రభావంతో మార్కెట్లన్నీ బంద్​ ఇదే అదనుగా రేట్లు పెంచిన కూరగాయల వ్యాపారులు సారథి న్యూస్, నర్సాపూర్: ‘వామ్మో.. గీవేం రేట్లు బిడ్డో. ముట్టకుంటే ధరలు మంట మండుతున్నయ్​. ఎట్ల కొనాలే.. ఎట్ల తినాలే..’ ఇది ఓ మహిళ ఆవేదన. ‘జేబు నిండ పైసలు తెస్తేనే గానీ కూరగాయలు సంచి నిండుతలేవ్​.. ఉప్పుపప్పులకే అంత బెడితే ఎట్ల బతకాలే. గీ రేట్లు ఎప్పుడు సూడలే’ ఇది ఓ మధ్యతరగతి ఉద్యోగి ఆందోళన. కరోనా […]

Read More
చెత్తసేకరణపై అవగాహన

చెత్తసేకరణపై అవగాహన

సారథి న్యూస్​, నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాజీపేట, తిమ్మాపూర్ తో పాటు పలు గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుచేయడంపై గురువారం మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ లింగంగౌడ్, ఉపసర్పంచ్ మాధవి శివ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటుకోవాలని సూచించారు. ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్త రిక్షాలు చెత్తను వేయాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరహరి, సీఏలు లావణ్య, […]

Read More

కూలి డబ్బులు ఇవ్వండి

ఉపాధి కూలీల నిరసన సారథి న్యూస్, నర్సాపూర్: ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలి డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ గురువారం మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి చెందిన 242 మంది ఉపాధి కూలీలు కౌడిపల్లి ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. కరోనా సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అనంతరం ఎంపీడీవో కోటిలింగం, జడ్పీటీసీ కవిత అమర్ సింగ్, ఎంపీపీ రాజు నాయక్, వైస్ ఎంపీపీ నవీన్ […]

Read More
108 కలశాలతో పూజలు

108 కలశాలతో పూజలు

సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం మహాన్యాస పూజలు నిర్వహించారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేక సహిత అష్టోత్తర శత(108) కలశాలతో అభిషేకం నిర్వహించారు. గంటంబొట్ల రాజేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఉమాశంకర్ శర్మ, మురళిశర్మ, రవిప్రసాద్ శర్మ , సుహాస్, వృశిష్ పాల్గొన్నారు.

Read More