తల్లిదండ్రులకు తెలియకుండా బాలుడి మతమార్పిడి ఓ ఇమామ్ దుర్మార్గం.. ఆందోళనలో తల్లిదండ్రులు నాగర్కర్నూల్ జిల్లా ఖానాపూర్లో వెలుగులోకి.. సామాజిక సారథి, బిజినేపల్లి: కనిపెంచిన తల్లిదండ్రులకు తెలియకుండా హిందూమతం నుంచి ఓ యువకుడిని మాయమాటలు చెప్పి ఇస్లాం మతంలోకి మార్చారు. పైగా ఆరునెలల నుంచి ఇంటికి రాకుండా చేశారు. చివరికి ఆ యువకుడు వేషం కూడా మార్చారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. నాగర్కర్నూల్జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్గ్రామానికి చెందినవెల్కిచర్ల శ్రీనివాసులు కుమారుడైన వెల్కిచర్ల […]
సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును శుక్రవారం ప్రగతి భవన్ లో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖ శ్యాంనాయక్ కలిశారు. ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరుచేసి సహకరించాలని కోరగా.. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. వారి వెంట ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బక్కశెట్టి కిషోర్ ఉన్నారు.
సారథి న్యూస్, బిజినేపల్లి: వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటించి కరోనాను దూరం చేసుకోవచ్చని వైద్యాధికారి డాక్టర్ కల్పన సూచించారు. శుక్రవారం ఆమె నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో మాస్కులను పంపిణీ చేశారు. చేతులను తరుచూ సబ్బు లేదా శానిజైటర్తో శుభ్రం చేసుకోవాలని.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ గోవిందు సుజాత, మాజిద్, సర్పంచ్ సితార, ఎంపీటీసీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.