సారథి న్యూస్,ఖమ్మం: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నల్లమోతు అప్పారావు (45) తన కొడుకు తేజు (20), మేనల్లుడు వినయ్ (19)తో కలిసి మంగళవారం పొలంలో కూరగాయల పంటకు పురుగు మందు పిచికారీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న రేపాక చెరువులోకి కాళ్లు కడుక్కునేందుకు వెళ్లారు . ఈ క్రమంలో తేజు చెరువులోకి దిగగా కాలు […]
సారథి న్యూస్, ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం మహాదేవపురం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మంగళవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులకు మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీచేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీకి అక్కడి లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని చెప్పారు. బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ మెండేం లలిత, టీఆర్ఎస్ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, సీఐ […]
సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామంలో కరోనా(కోవిడ్–19) పాజిటివ్ కేసు నమోదైనట్లు డీఎంహెచ్‌వో మాలతి సోమవారం తెలిపారు. ఇటీవల ఆ గ్రామానికి ముంబై నుంచి 17 మంది ప్రత్యేకబస్సులో వచ్చారు. వారిలో ఏడుగురిని కరోనా టెస్ట్‌లకు పంపించగా, వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు.
సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తుమ్మలనగర్ లో స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సుమారు 30 మంది ఆదివాసీ పేద కుటుంబాలకు టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో మాస్క్ లు, నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు కలగకూడదనే సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.