సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ నియంత్రణకు నిర్విరామంగా కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం విజయవాడలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డితో కలసి కోవిడ్ నియంత్రణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం చేస్తున్న పనితీరును ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా మాస్కులు కట్టుకుని కోవిడ్ 19 […]
అమరావతి: మూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరఫున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్దాఖలుకు 10 రోజుల సమయం కోరారు. విచారణను ఈనెల 14కు […]
సారథి న్యూస్, కర్నూలు: అనంతపురం జిల్లాకు చెందిన 8 మంది ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారిని విధుల కోసం కర్నూలు జిల్లాకు కేటాయించారు. గురువారం వారు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్పను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. మరిన్ని పదోన్నతులు పొందాలని ఎస్పీ ఆకాంక్షించారు. కరోనా సమయంలో ప్రజలకు మంచి సేవలు అందించి పోలీసుశాఖకు పేరు తీసుకురావాలని కోరారు.
సారథి న్యూస్, కర్నూలు: కరోనా విజృంభణ నేపథ్యంలో కర్నూలు నగరంలోని కంటైన్మెంట్జోన్లలో లాక్ డౌన్ పరిస్థితిని శనివారం కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప, నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ సమీక్షించారు. నగరంలోని రాజ్ విహార్ సర్కిల్ మీదుగా కొండారెడ్డి బురుజు, మాలగేరి, వడ్డేగేరి, పెద్దమార్కెట్, పూలబజార్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, గనిగల్లీ నగర్, ఉస్మానియా కాలేజీ మీదుగా తదితర ప్రాంతాల్లోని పలురోడ్లు, వీధుల్లోని కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ పరిస్థితిని కాన్వాయ్ లో కలియ […]