Breaking News

JURALA

కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం

కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ కు శనివారం పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరింది. ప్రాజెక్టు మొత్తం నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు. అయితే ప్రాజెక్టులో 31 ఫీట్లకు నీటి నిల్వ చేరింది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి కోయిల్ సాగర్ కు ఒక మోటారు ద్వారా కృష్ణాజలాలను తరలిస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి పెద్దఎత్తున వర్షపునీరు ప్రాజెక్టులోకి […]

Read More
మల్లన్న సన్నిధికి కృష్ణవేణి

మల్లన్న సన్నిధికి కృష్ణవేణి

జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు 25 గేట్లు ఎత్తి.. 2.02లక్షల క్యూసెక్కుల నీటి విడుదల శ్రీశైలం రిజర్వాయర్​కు తరలివస్తున్న వరద నీరు సారథి న్యూస్, కర్నూలు/మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బిరబిరా మంటూ కృష్ణవేణి శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాం నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. దీంతో గేట్లు ఎత్తివేయడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద […]

Read More
జూరాలకు భారీ వరద

జూరాలకు భారీ వరద

సారథిన్యూస్​, గద్వాల: జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్నది. మహారాష్ట్రలో కొంతకాలంగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో గేట్లు ఎత్తివేశారు. జూరాలకు లక్ష 90 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తున్నది. అధికారులు జూరాల ప్రాజెక్టులో25 గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1,62,916 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జూరాలకు 1,90, 844 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం […]

Read More
శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు

డ్యామ్​లో 815 అడుగుల నీటిమట్టం జూరాల 8గేట్లు ఎత్తి నీటి విడుదల సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉరకలెత్తుతోంది. కర్ణాటక, మహారాష్ర్ట ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్‌కు నీటిని వదిలారు. అక్కడి నుంచి జూరాలకు ప్రస్తుతం 60వేల క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.440 మీటర్లకు చేరింది. నీటి […]

Read More
జూరాల 6 గేట్ల ఎత్తివేత

జూరాల 6 గేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆరుగేట్లను బుధవారం ఎత్తి 34,320 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. ఎగువ, దిగువ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్​కోసం 21,240 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. జూరాల నుంచి మొత్తంగా 59,380 క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.

Read More
బిరబిరా కృష్ణమ్మ

బిరబిరా కృష్ణమ్మ

సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. బుధవారం జూరాలకు 40,076 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోని ఆరుగేట్ల ద్వారా 8,956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కోసం మరో 16,162 క్యూసెక్కులను వినియోగిస్తూ జూరాల నుంచి మొత్తంగా 25,118 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్​కు […]

Read More

జూరాల నీటివిడుదల

సారథి న్యూస్, మహబూబ్ నగర్: ఈ ఏడాది తొలిసారి 20 రోజుల ముందుగానే ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహాం, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీరు జూరాల ప్రాజెక్టుకు చేరకపోయినా జూరాల కుడి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ సారి ఎగువ భారీగా వర్షాలు […]

Read More
జూరాల వైపు కృష్ణమ్మ

జూరాల వైపు కృష్ణమ్మ

సారథి న్యూస్, గద్వాల: కర్ణాటకలోని నారాయణ్ పూర్ డ్యాం నుంచి కృష్ణానది నీటిని ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. రెండుగేట్లను ఒక మీటర్ పైకి ఎత్తి 11,240 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణాజలాలు జూరాల వైపు పరుగులు తీస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టులను నింపి తెలంగాణలోని ప్రాజెక్టుల వైపు కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభమయ్యాయి. ఆల్మట్టి జలశయానికి ఎగువ నుంచి 69వేల […]

Read More