ఎస్సైకి నిప్పంటుకున్న వైనం రెండువర్గాలుగా విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు సామాజికసారథి, జోగుళాంబగద్వాల: జిల్లాలోని కేటీదొడ్ది మండలం ఇర్కిచేడులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గురువారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు రెండువర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకూ వినని ఓ వర్గం వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించారు. దీంతో అక్కడే ఉన్న ఎస్సైకి నిప్పంటుకుంది. కాగా ప్రత్యర్థివర్గం వారు వెంటనే […]
సారథి, అలంపూర్(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రఘురామశర్మ బుధవారం అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి వెబ్సైట్ నుంచి అందిన ఫిర్యాదులపై సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే ఊట్కూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వభూమిలో గతంలో లావాణీ పట్టాలు ఇచ్చినా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో రైతుల భూములను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ విషయమై […]
సారథి, మానవపాడు/రామడుగు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం, పుల్లూరు గ్రామంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో జరిగాయి. కరోనా చీకట్లు తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా రైతులకు సకాలంలో వర్షాలు పడుతూ అన్నివర్గాల ప్రజలు, వ్యాపారులు అభివృద్ధి చెంది నిండునూరేళ్లు అష్టఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని పుల్లూరు గ్రామ ప్రజలు పూజించారు. – కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సీతారాముల కల్యాణానికి భద్రాచలం […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన బోయ దంతేశ్వరి కుమార్తె కుటుంబాన్ని ఆదివారం జడ్పీటీసీ కాశపోగు రాజు పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. దంతేశ్వరి కుమార్తె నివాస గుడిసె ఇటీవల కరెంట్ షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే అబ్రహం దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట తనగల సర్పంచ్ రాణి, ఎంపీపీ భర్త రాజు, టీఆర్ఎస్ నాయకులు రాముడు, జయ్యన్న, […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ లో జరిగే జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన కలిసిన వారిలో దేవాదాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
సారథి న్యూస్, మానవపాడు: పరిహారం ఇవ్వకుండా తమ పొలాల గుండా హెచ్‌పీసీఎల్ గ్యాస్ పైప్లైన్వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. తగిన పంట నష్టపరిహారం ఇవ్వకుండా కోర్టు నోటీసులు పంపించి దౌర్జన్యంగా పైప్‌లైన్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. మిరప పంట, పత్తి పనులు పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సారథి న్యూస్, మానవపాడు: సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం పెరుగుతుందని వ్యవసాయ సంచాలకుడు సక్రియ నాయక్ రైతులకు సూచించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దఆముదాలపాడు గ్రామంలో ‘భూసార పరీక్ష.. సుస్థిర వ్యవసాయం’పై అలంపూర్డివిజన్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భావితరాలకు అవసరమైన భూములను అందిద్దామని పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మానవపాడు మండల […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆఖండ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిఖ్యాత తత్వవేత్త, గొప్పవ్యక్తి అని కొనియాడారు. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పుల్లూరు గ్రామపెద్దలు చల్లా గిరిధర్ రెడ్డి, కలుగోట్ల పీఏసీఎస్ చైర్మన్ గజేందర్ రెడ్డి, సర్పంచ్ నారాయణమ్మ, ఎంపీటీసీ సభ్యులు […]