శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఆ ముగ్గురు జైషే మహ్మద్ టెర్రర్ గ్రూప్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒక వ్యక్తి ఐఈడీ ఎక్స్‌పర్ట్ అని పోలీసులు అన్నారు. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కాసమాచారంతో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సెక్యూరిటీ ముగ్గుర్ని మట్టుబెట్టారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్‌తో చాలా ఎటాక్స్‌కు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన వలీద్ అనే టెర్రరిస్టు […]
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ నేతను కాల్చిచంపారు. జమ్ముకశ్మీర్‌లోని బందిపోర్‌లో బీజేపీ నేత వసీమ్ కుటుంబం నివాసం ఉంటున్నది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బీజేపీ నేత కుటుంబం ఓ దుకాణం వద్ద కూర్చొని ఉన్నది. ఇదే అదనుగా భావించిన ఉగ్రమూకలు అక్కడికి చొరబడి బీజేపీ నేత వసీమ్, అతడి తండ్రి బషీర్, సోదరుడు ఉమర్ బషీర్‌పై కాల్పులు జరిపారు. ఆ దుకాణం పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్నది. సమాచామందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని […]
శ్రీనగర్: పాక్ ఆక్రమిత్ కశ్మీర్ (పీవోకే)లో చైనాకు వ్యతిరేకంగా సోమవారం ఆందోళనలు జరిగాయి. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్‌లో అక్కడి ప్రజలు నిరసన చేపట్టారు. ‘సేవ్ రివర్స్, సేవ్ జమ్మూ’ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపైన్ స్టార్ట్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు ఏ ప్రాతిపదికన చేసుకున్నారని నిరసనకారులు ప్రశ్నించారు. ఈ విషయంలో రెండు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. […]
అనంత్‌నాగ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని అనంత్నగాగ్ జిల్లా ఖుల్‌చోహార్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ స్థలంలో పోలీసులు, ఆర్మీ జవాన్ల గాలింపు కొనసాగుతుందని కశ్మీర్ జోన్ పోలీసులు చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. శనివారం చేవా ఉల్లార్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. జమ్మూకశ్మీర్ లో ఇటీవల వరుసగా సాగుతున్న ఎదురుకాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనికబలగాలతో కలిసి […]