న్యూఢిల్లీ: భారత్ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించాలన్నది తన కల అని పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఇందుకోసం ఎంతవరకైనా శ్రమిస్తానన్నాడు. ‘2023 ప్రపంచకప్‌లో ఆడతాననే నమ్మకం ఉంది. అంతేకాదు నేను ఎక్కడైతే శిక్షకు గురయ్యానో.. అదే ఐపీఎల్లో మళ్లీ సత్తా చాటుతా. ఈ విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నా. నేను పునరాగమనం చేస్తున్నది కేవలం రంజీల కోసం కాదు. టీమిండియా, ఐపీఎల్‌కు ఆడటం నా ప్రధాన లక్ష్యం. జట్టుకు విజయాలు అందించాలనే కసి, పట్లుదల నాలో ఇంకా చావలేదు. […]
ముంబై: పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ఏడాది ఐపీఎల్‌ను నిర్వహించాలనే పట్టుదలతోనే బీసీసీఐ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా వ్యాఖ్యలు అలా వచ్చాయే లేదో.. ఐపీఎల్ కోసం తాత్కాలిక షెడ్యూల్‌కు అనుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు లీగ్‌ను నిర్వహించాలని ఆలోచనలు చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే టీ20 ప్రపంచకప్ అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాత, ఇతర అంతర్జాతీయ టోర్నీలను చూసుకుని ఈ తేదీల్లో కాస్త మార్పులు చేసే […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో ఐపీఎల్ జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్‌ను నిర్వహించడం పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారమన్నాడు. అయితే సెప్టెంబర్‌లో శ్రీలంక లేదా యూఏఈలో మెగా టోర్నీని నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ‘స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తూ ఆసీస్ నిర్ణయం తీసుకోవడంతో టీ20 ప్రపంచకప్‌పై ఆశలు మొలకెత్తుతున్నాయి. అక్టోబర్‌లో ఈ మెగా ఈవెంట్ ఉంటే అంతకంటే ముందుగానే అన్ని జట్లు అక్కడికి వెళ్తాయి. క్వారంటైన్, […]
ముంబై: టీ20 ప్రపంచకప్‌పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటేనే.. మిగతావన్నీ ప్రణాళికల ప్రకారం జరుగుతాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఇతర టోర్నీలను పట్టాలెక్కించాలంటే మరికాస్త సమయం పడుతుందన్నాడు. సెప్టెంబర్–అక్టోబర్ విండో లభిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని, లేకపోతే కష్టమేనని చెప్పాడు. ‘ప్రపంచకప్‌పై ఐసీసీ ఏదో ఓ నిర్ణయం చెప్పాలి. వేచి చూడడం వల్ల ఎఫ్టీపీ మొత్తం దెబ్బతింటుంది. కరోనాతో చాలా సిరీస్‌లు రద్దయ్యాయి. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ను రూపొందించుకోవాలంటే ఐసీసీ నిర్ణయం కీలకం. […]
ముంబై: ఓవైపు కరోనా మహమ్మారి భయపెడుతున్నా.. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో.. తాము ఐపీఎల్‌కు రెడీగా ఉన్నామని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు లేఖ రాశాడు. అభిమానులను అనుమతించకుండా, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నాడు. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని దాదా తెలిపాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ అన్ని […]
న్యూఢిల్లీ: భారత్‌లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. విదేశాలకు తరలించడంపై బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తమ ముందున్న చివరి ప్రత్యామ్నాయం అదేనని బోర్డు వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ తమ మొదటి ప్రాధాన్యం మాత్రం భారతే అని స్పష్టం చేశాయి. ‘మాకు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాం. క్రికెటర్ల ఆరోగ్యానికి ఇబ్బందులు లేకుండా ఉండి, ప్రభుత్వం అనుమతి ఇస్తే లీగ్ ఇక్కడే జరుగుతుంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించని పక్షంలో, సరైన విండో లభిస్తే […]
న్యూఢిల్లీ: ఐపీఎల్లో విదేశీ స్టార్లు ఆడకపోతే కళ తప్పుతుందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. ఈ లీగ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని, అందుకే అందరూ పాల్గొనాలని సూచించాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌పై ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే అది తొందరపాటే అవుతుంది. భారత్ తయారుచేసిన ఓ అంతర్జాతీయ ఈవెంట్ ఈ లీగ్. ప్రపంచ క్రికెట్‌కే ఇది తలమానికం. క్రికెట్లో ప్రీమియర్ ఈవెంట్ కూడా. అందుకే విదేశీ క్రికెటర్లు కచ్చితంగా ఉండాల్సిందే. […]
టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏదో ఓ దశలో ఐపీఎల్ జరిగితేనే మంచిదని టీమిండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ కోరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించినా ఫర్వాలేదని కుంబ్లే అన్నాడు. ఈ ఆలోచన తప్పు కాదన్నాడు. ‘ఐపీఎల్ జరగాలని నేను బలంగా కోరుకుంటున్నా. అంతర్జాతీయ షెడ్యూల్‌ను సమీక్షిస్తే ఈ ఏడాది లీగ్ కు సమయం లభిస్తుందని భావిస్తున్నా. ఒకవేళ ప్రేక్షకులకు అనుమతి లేకుంటే.. నాలుగు […]