ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 13, 28,336 కు చేరుకుంది. గత 24 గంటల్లో 46,121 కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు 67.6 శాతం రికవరీ రేటు ఉందని కేంద్ర వైద్యశాఖ అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు కరోనాతో 40, 699 మంది మృతిచెందగా, 5,95,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
వాషింగ్టన్: టిక్‌టాక్ సహా అనేక చైనా యాప్‌లపై ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ తన యాజమాన్యాన్ని మార్చుకొని మళ్లీ ఇండియాకు వచ్చేస్తోంది. అది ఎలాగంటే.. టిక్‌టాక్ చైనా కంపెనీ కాబట్టి భారత్ నిషేధించింది. కానీ అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్.. టిక్‌టాక్‌ను కొనుగోలు చేస్తోంది. అమెరికాకు చెందిన కంపెనీ అయితే మన ప్రభుత్వానికి అభ్యంతరం ఉండదు. కాబట్టి టిక్‌టాక్ త్వరలోనే ఇండియాకు వచ్చేస్తుందని సమాచారం. అమెరికా ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌ను నిషేధిస్తుందని కొంతకాలంగా వార్తలు […]
ఢిల్లీ: మనదేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. గత 24 గంటల్లో 6,61,715 టెస్టులు చేయగా.. 52,050 కొత్తకేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. కాగా, ఇప్పటివరకు మొత్తం 12,30 509 మంది కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 38,938కు చేరుకుంది. 5,86,298 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్యశాఖ అధికారులు తెలిపారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ద్వారానే కరోనాను అరికట్టవచ్చన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ సరిగ్గా టెస్టులు చేయడం లేదు. కరోనా రోగుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18,03,695 కు చేరుకుంది. గత 24 గంటల్లో 52,972 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో దేశవ్యాప్తంగా 38,135 మంది […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు 10,94,374 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. అగ్రదేశాలైన అమెరికా, రష్యా వంటి దేశాలతో పోల్చుకున్నప్పడు ఇండియాలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. కాగా, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 57,118 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,95,988కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో అధికారికంగా 36,511 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా […]
ఢిల్లీ: ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక నుంచి భారత్‌లో తమ క్యాంపస్‌లను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ఇకనుంచి విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలోని పలు నగరాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయి. అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను భారత్‌లో నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కాగా ఆయా విద్యాసంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులను వసూలు చేయకుండా ఎన్ఈపీ(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) కంట్రోల్ చేయనున్నది. […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,123 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 64.4 శాతం రికవరీ రేటు ఉన్నదని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 10,20,582 మంది కరోనా నుంచి కోలుకోగా.. కేవలం గత 24 గంటల్లోనే 32,553 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 34, 968 మంది పొట్టనబెట్టుకున్నది. 5,28,242 యాక్టివ్ కేసులున్నాయి.
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో 47,703 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,83,156 కు చేరింది. వరుసగా ఆరోరోజు 45 వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికి 33,425 మంది కరోనాతో మృతిచెందారు. 9,52,743 మంది డిశ్చార్జి కాగా.. 4,96,988 యాక్టివ్ కేసులున్నాయి.