*శ్రీను మృతికి కారకురాలైన ప్రిన్సిపల్, వార్డెన్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* *బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి* *తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య డిమాండ్ సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో :ధర్మాపూర్ మహాత్మా జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాల లో ఆరవ తరగతి చదువు తున్న విద్యార్థి శ్రీను అనుమానస్పద గా బుధవారం మృతి చెందారు.హన్వాడ మండల కేంద్రానికి చెందిన బ్యాకరి కృష్ణయ్య అంజమ్మల దంపతుల రెండవ […]
సామాజికసారథి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరేందుకు నిర్వహించిన ఎంట్రెన్స్(ఆర్‌జేసీ సెట్-2022) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 19,360 సీట్ల కోసం ఫిబ్రవరి 20న నిర్వహించిన ఈ ప్రవేశపరీక్షకు 60,173 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. మెరిట్ సాధించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 21 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. […]
సామాజికసారథి, హైదరాబాద్: గత మే నెలలో నిర్వహించిన TSWRJC & COE CET-2022 ప్రవేశపరీక్ష Phase-2 ఫలితాలు వెలువడ్డాయి. మొదటి దశలో సీటు రాని వారు 2వ దశలో మీ ఫలితం చూసుకోవచ్చు. అలాగే ఈనెల 10న సాధారణ గురుకులాల కాలేజీలకు రాసిన ప్రవేశపరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. https://tsswreisjc.cgg.gov.in
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన గురుకులం, మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి చదివేందుకు గత మే 8వ తేదీన నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సంబంధిత స్కూలులో జాయిన్ కావాలని గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు ప్రకటించారు. సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను అందుబాటులో పొందుపరిచారు. వెబ్సైట్ లోకి […]
సామాజికసారథి, హైదరాబాద్: గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2022 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 1,34,478 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. గత విద్యాసంవత్సరంలో 74,52 మంది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48,120 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ఒక్క సీటు కోసం సగటున ముగ్గురు విద్యార్థులు పోటీపడ్డారు. ప్రభుత్వం […]
44మంది విద్యార్థినులకు అస్వస్థత ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సాంఘిక శాఖ సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం స్కూలులో బ్రేక్ పాస్ట్ లో పులిహోర తిన్న విద్యార్థినులు టిఫిన్ చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులకు ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. […]
ప్రిన్సిపల్ డి.శ్రీనివాస్ వ్యవహారంపై విచారణ కేసు దర్యాప్తు చేస్తున్న కొత్తకోట పోలీసులు సామాజిక సారథి, కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోటలో ప్రస్తుతం కొనసాగుతున్న వీపనగండ్ల సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయినిపై ప్రిన్సిపల్ కీచరపర్వం ఆలస్యంగా వెలుగు చూడటంతో జిల్లా కలెక్టర్ యాస్మిన్‌భాషా స్పందించారు. వేధింపుల ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రిన్సిపల్ డి.శ్రీనివాస్‌ను పిలిచి ఛీవాట్లు పెట్టారు. ఆయన ఇచ్చిన సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాథ్స్ టీచర్ టి.మాధవిని ప్రిన్సిపల్ డి.శ్రీనివాసులు […]
సారథి, వేములవాడ: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయని, ఈనెల 19 తేదీ నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ మాతంగి కళ్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు www.telangana.gov.in, లేదా www.tswrais.inవెబ్ సెట్ ల లో ప్రవేశ పరీక్ష ఫలితాలను సరిచూసుకోవాలని కోరారు. మొదటి దశ కౌన్సెలింగ్ ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు […]