సామాజికసారథి, హైదరాబాద్: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. బుధవారం 30వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. గురువారం టెట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టనుంది. ఏప్రిల్ 12ను దరఖాస్తులకు చివరితేదీగా గడువు విధించింది. జూన్ 12న పరీక్ష నిర్వహించనుంది.
సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50వేల మేర ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తీచేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి […]