సారథి, రామడుగు: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా కన్వీనర్, గోపాల్ రావు పేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న శుక్రవారం పాత్రికేయులకు సరుకులు, బియ్యం, పప్పు తదితర వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనునిత్యం వార్త సేకరణ చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పాత్రికేయులు గంటే భాస్కర్, ఎజ్రా మల్లేశం, రామస్వామి, రజాక్, రమేష్, బొడిగే శ్రీను, మహేష్ పాల్గొన్నారు.
సారథి, రామడుగు: మానవత్వం ఇంకా బతికే ఉందన్నదానికి ఈ సాయమే నిదర్శనం. కరోనా బాధితురాలిని అద్దె ఇంట్లో నుంచి గెంటివేస్తే వారికి ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకున్నారు ఓ మంచి మనిషి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటలో కరోనా బారినపడిన కుటుంబానికి అద్దెకు ఇచ్చిన యజమాని తమ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. వెంటనే ఆ కుటుంబానికి సర్పంచ్ సత్యప్రసన్న చేయూత ఇచ్చారు. రెండ్ల మల్లేశం ఆ కుటుంబ పరిస్థితిని వారికి తీసుకుపోవడంతో నిర్మాణదశలో ఉన్న […]
సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామపంచాయతీ సర్పంచ్ సత్యప్రసన్నకు విజ్డమ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లీడర్షిప్ అవార్డును రాష్ట్రపతి అవార్డు గ్రహీత కొండా రవి అందజేశారు. ఈ అవార్డు రాకతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సత్యప్రసన్న అన్నారు. తన సేవాభావాన్ని గుర్తించిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్రావుపేట గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావును ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. దీంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే తదితరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రజబ్ అలీ, గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి బాబు, పూడూరి మల్లేశం, ఎడవెల్లి పాపిరెడ్డి, అంజయ్య, రాజిరెడ్డి, మల్లేశం, కమలాకర్, శ్యాంసుందర్ రెడ్డి, రమేష్, […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల గోపాల్రావుపేటలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మార్కెట్ ఆవరణలో 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. మొక్కలను నాటడం గొప్పకాదు వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: ఇంటింటికి ఇంకుడు గుంత తప్పనిసరి నిర్మించుకోవాలని కరీంనగర్ జిల్లా రామడుగు సర్పంచ్ సత్యప్రసన్న కోరారు. ఆదివారం గోపాల్ రావు పేట్ మూడవ వార్డులో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహకంగా రూ.4100 ఇస్తుందన్నారు. వార్డులో 15 మంది ఇళ్ల వద్ద ఇంకుడుగుంతల తవ్వకాన్ని ప్రారంభించారు.