సారథి న్యూస్, ధర్మారం(రామగుండం): అన్ని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తామని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ బహూకరించి నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారిని వీలైనంత వరకు వెడల్పు చేసి అత్యాధునిక వీధిదీపాలను ఏర్పాటు చేసుకుందామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.4,82,500 విలువైన చెక్కులను 9మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్ శాఖ తరఫున జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని అక్టోబర్2న స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. గాంధీజీ స్ఫూర్తితో రాష్ట్రంలోని పట్టణాల్లో స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన ఆయా కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు. టీఎస్ బి పాస్ బిల్లుకు శాసనసభ ఆమోదం లభించిందన్నారు. అధికారులు, […]