సారథి, మానవపాడు: మానవపాడు సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి కరోనా టీకా వేసుకున్నారు. ఎలాంటి అపోహలకు భయపడకుండా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆత్మ లింగారెడ్డి కోరారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ సవిత, హెల్త్ సూపర్ వైజర్ చంద్రన్న, ఫార్మసిస్ట్ తీరుమల్, స్టాఫ్ నర్స్ మహాలక్ష్మి, ఏఎన్ఎం మున్ని, షాజహాన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సోని, ఆశా వర్కర్లు ఉన్నారు.
సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ జగ్గుల చిన్నయ్యకు తెలంగాణ సాంస్కృతిక నాటక అకాడమీ ఉత్తమ అవార్డు దక్కింది. ఈ అవార్డును రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా జెగ్గుల చిన్నయ్య మాట్లాడుతూ.. 40 ఏళ్ల నుంచి కళాకారుడుగా శ్రీకృష్ణరాయబారం, చింతామణి హరిశ్చంద్ర నాటకాల్లో పలు పాత్రలను పోషించి కళాభిమానుల ఆదరణ పొందినందుకు గుర్తింపుగా తనకు అవార్డు రావడం సంతోషంగా […]
సారథి న్యూస్, అలంపూర్: ఇటిక్యాల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌కేంద్రంలో అలంపూర్ఎమ్మెల్యే డాక్టర్వీఎం అబ్రహం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఇక్కడే మాజీ ఎంపీ మందా జగన్నాథం ఓటు వేశారు. మానవపాడు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానవపాడు పోలింగ్ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పరిశీలించారు.
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభివాణి దేవిని అధిక మెజార్టీతో గెలిపించాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య పట్టభద్రులను కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలో మానవపాడు మండలం, పల్లెపాడు, బోరవెల్లి, చండూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల […]
కేటీదొడ్డి(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాగుంట గ్రామంలో గురువారం విద్యుత్ షాక్ సర్క్యూట్ సంభవించడంతో రమేష్ కు చెందిన పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. టీవీ, రెండు క్వింటాళ్ల బియ్యం, దుస్తులు, సామాన్లు కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.రెండులక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ సుభాషిణిరెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితుడు రమేష్ కోరాడు.
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల(మానవపాడు): అష్టాదశశక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగుళాంబ అమ్మవారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర కలశాభిషేకంలో పాల్గొని అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం […]
సారథి న్యూస్, మానవపాడు: పరిహారం ఇవ్వకుండా తమ పొలాల గుండా హెచ్‌పీసీఎల్ గ్యాస్ పైప్లైన్వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. తగిన పంట నష్టపరిహారం ఇవ్వకుండా కోర్టు నోటీసులు పంపించి దౌర్జన్యంగా పైప్‌లైన్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. మిరప పంట, పత్తి పనులు పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సారథి న్యూస్, మానవపాడు: సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం పెరుగుతుందని వ్యవసాయ సంచాలకుడు సక్రియ నాయక్ రైతులకు సూచించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దఆముదాలపాడు గ్రామంలో ‘భూసార పరీక్ష.. సుస్థిర వ్యవసాయం’పై అలంపూర్డివిజన్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భావితరాలకు అవసరమైన భూములను అందిద్దామని పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మానవపాడు మండల […]