Breaking News

GADWALA

నకిలీ విత్తనాల పట్టివేత

నకిలీ విత్తనాల పట్టివేత

సారథి, మల్దకల్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై దృష్టిపెట్టారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ ఎస్సై శేఖర్ తన సిబ్బందితో పక్కా సమాచారంతో దాడులు చేసి 30 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. రైతులకు ఎవరు నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు..

Read More
నేడే రంజాన్ పండగ

నేడే రంజాన్ పండగ

సారథి, మానవపాడు: కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించాలని, అందరూ సుఖశాంతులతో జీవనం కొనసాగించాలని ముస్లింలు గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జామియా మసీదు ముతవల్లి మహబూబ్ పాషా కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే రంజాన్ చేసుకోవాలని కోరారు.

Read More
బాలయోగి ఇక లేరు

బాలయోగి ఇక లేరు

సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురంలో బాలయోగి శివనారాయణస్వామి కన్నుమూశారు. స్వామివారు 76 ఏళ్లుగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శివనారాయణ స్వామి ఇక లేరనే వార్తను భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివనారాయణ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు విశేషసంఖ్యలో తరలివచ్చేవారు. స్వామివారు లేక లేరని భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read More
కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

సారథి, మానవపాడు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపధ్యంలో ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవడంతో పాటు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని డాక్టర్ సవిత సూచించారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సిన్ నేషన్ నిర్వహించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కరోనా నివారణ టీకాను వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు వద్దని ఆమె సూచించారు. ఏదైనా అత్యవసర పనిమీద బయటకొచ్చి ఇంటికి వెళ్లి తప్పనిసరిగా కాళ్లు, చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలని […]

Read More
టీఆర్ఎస్​ప్రభుత్వానికి అండగా ఉందాం

టీఆర్ఎస్ ​ప్రభుత్వానికి అండగా ఉందాం

జడ్పీటీసీ కాశపోగు రాజు, ఎంపీపీ రజితమ్మ 50 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ సారథి, వడ్డేపల్లి(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్​వీఎం అబ్రహం ఆదేశాల మేరకు శుక్రవారం వడ్డేపల్లి తహసీల్దార్ ​ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తహసీల్దార్​ మధుసూదన్​రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు, ఎంపీపీ రజితమ్మ, మున్సిపల్ చైర్మన్ కరుణమ్మ 50 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. రామాపురం, జిల్లేడుదిన్నె, కొవెలదిన్నె, బుడమరసు, జులకల్, గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన రూ.5,105,916 విలువైన చెక్కులను […]

Read More
45 ఏండ్లు నిండినవారు వ్యాక్సిన్​ తీసుకోండి

45 ఏండ్లు నిండినవారు వ్యాక్సిన్​ తీసుకోండి

సారథి, మానవపాడు: ఎలాంటి అపోహలకు భయపడకుండా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని మానవపాడు పీహెచ్​సీ డాక్టర్​శశికిరణ్​కోరారు. శనివారం స్థానిక మానవపాడు పీహెచ్​సీని గద్వాల డీఐవో డాక్టర్ శశికళ సందర్శించి వార్డుల రూములను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సమయానికి మిమ్మల్ని పట్టించుకుంటున్నారా? లేదా? ఏమైనా ఆరోగ్య విషయంలో ఇబ్బంది వస్తే వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నారా? లేదా? అన్న అంశాలను ఆరాతీశారు. 45 ఏండ్లు పైబడిన వారు తప్పకుండా కరోన టీకాను వేయించుకోవాలని […]

Read More
45ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్​ తీసుకోవాలి

45ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్​ తీసుకోవాలి

సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు హెల్త్​సెంటర్​ను డీఎంహెచ్​వో డాక్టర్​చందునాయక్ సందర్శించి ఇక్కడ అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. 45ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కరోనా సెకండ్​వేవ్​ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైద్యులు, డాక్టర్లు సమయపాలన పాటించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అమరవాయి గ్రామంలో ఉన్న హెల్త్​సబ్ సెంటర్ ను పరిశీలించి అక్కడ ఉన్న వైద్యసిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో […]

Read More
తైబజార్​ దళారులు మా కడుపు కొడుతున్నరు

తైబజార్​ దళారులు మా కడుపు కొడుతున్నరు

సారథి, అయిజ(మానవపాడు): అయిజ మున్సిపాలిటీ పరిధిలో తైబజార్ నిర్వహించే వ్యాపారులు అధికార బలంతో చిరువ్యాపారులపై దౌర్జన్యం చేస్తూ అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూరగాయల తై బజార్ లో రేట్లను అడ్డగోలుగా పెంచి తమ పొట్టగొడుతున్నారని రైతులు చిరు వ్యాపారులతో కలిసి రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు. గంప కూరగాయలు తీసుకొస్తే రూ.30 వస్తే.. అందులో దళారులు, తైబజార్ నిర్వాహకులకు రూ.25 పోతే వచ్చే రూ.ఐదుతో కనీసం రవాణా చార్జీలు కూడా వెళ్లక నానాఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. […]

Read More