Breaking News

FATHER

కూతురును కాపాడబోయి..

సారథి న్యూస్​, మానవపాడు: కూతురును రక్షించబోయిన ఓ తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు (27), కూతురు మానస (4) ఇంటి ముందు ఆడుకుంటోంది.ఈ క్రమంలో ఇంటి ఎదుట ఉన్న ఓ భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. చెట్టు కొమ్మలు మీద పడతాయన్న భయంతో తండ్రి రామాంజనేయులు కూతురును రక్షించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతనిపై విద్యుత్​ తీగలు పడడంతో గాయాలయ్యాయి. మెరుగైన […]

Read More
శేఖర్​ కమ్ముల

శేఖర్​ కమ్ముల ఇంట విషాదం

ప్రముఖ దర్శకుడు శేఖర్​ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. ఆయన తండ్రి శేషయ్య శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడతున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్​ బన్సీలాల్​ శ్మశానవాటికలో శేషయ్యకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు శేఖర్​ కమ్ములకు ఫోన్​ చేసి సంతాపం తెలిపారు. ప్రస్తుతం శేఖర్​ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్​స్టోరీ’ అనే సినిమా తీస్తున్నాడు. సినిమా షూటింగ్​ పూర్తయినప్పటికీ కరోనా లాక్​డౌన్​తో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

Read More

సొంత మార్గాన్ని వెతుక్కోండి: కోహ్లీ

న్యూఢిల్లీ: పెద్దవాళ్లు భౌతికంగా దూరమైనప్పటికీ.. తమ పిల్లల్ని పైనుంచి చూస్తూనే ఉంటారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అదే సమయంలో జీవితంలో ముందుకు సాగడానికి మనకంటూ ఓ సొంత మార్గాన్ని ఎంచుకోవాలన్నాడు. ‘ఫాదర్స్’ డే సందర్భంగా చిన్నప్పుడు తండ్రితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ‘కుటుంబాన్ని, తల్లిదండ్రులను ప్రేమించండి. మీ తండ్రి మీపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతతో ఉండండి. మీ కంటూ ఓ మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగండి. మీరెప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన […]

Read More

తండ్రిని చంపిన కొడుకు

సారథి న్యూస్​, హుస్నాబాద్: భూ తగాదాలతో ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చాడు. ఈ దారుణఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లిలో చోటుచేసుకున్నది. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..గండిపల్లికి చెందిన లూనావత్ సోమ్లా నాయక్ (74)కు కొంత కాలంగా కుమారుడు సమ్మయ్యతో భూమివిషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సోమ్లానాయక్​ తన పొలం దగ్గరకు వెళ్తుండగా కుమారుడు సమ్మయ్య అడ్డగించాడు. భూమి విషయంలో ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన […]

Read More