సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సైబరాబాద్సీపీ సజ్జనార్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు సోమవారం ప్రగతిభవన్‌లో కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 2020 వార్షిక రిపోర్టును సీపీ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతిచ్చారు. విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రతిరోజు డ్రంకెన్ […]