భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంతో విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్లయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులను దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తుంటారు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాల్లో అక్కడ పండితులు ‘గో బ్రాహ్మణో శుభం భవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు’ అనే ఆశీర్వదిస్తారు. దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో […]