Breaking News

COURT

‘మర్డర్’​కు బ్రేక్​.. వర్మకు షాక్​

సంచలన దర్శకుడు రాంగోపాల్​ వర్మకు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్​ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్​ హత్యను ఇతివృత్తంగా తీసుకొని రాంగోపాల్​వర్మ.. మర్డర్​ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘మర్డర్’​ సినిమా తన కుమారుడి హత్యకేసు విచారణను ప్రభావితం చేస్తుందని.. అందువల్ల సినిమా విడుదలను నిలిపివేయాలని ప్రణయ్​ తండ్రి కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్డు ఈ విచారణ పూర్తయ్యేవరకు ‘మర్డర్’ సినిమాను విడుదల చేయొద్దని సోమవారం […]

Read More

హైకోర్టులోనూ పైలట్​కే అనుకూలం

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సచిన్​ పైలట్​కు హైకోర్టులో మరోసారి ఊరట దక్కింది. సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై రాజస్థాన్ స్పీకర్​ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పైలట్​ ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. గురువారం దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈకేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలంటూ పైలట్​ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. ఈ కేసులో తుదితీర్పు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యేల అనర్హత […]

Read More

వరవరరావు బెయిల్ పిటిషన్‌‌ నిరాకరణ

ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు నిరాకరించింది. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్‌ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టైన […]

Read More

ఆరోగ్యసిబ్బందికి పూర్తి వేతనం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్యసిబ్బందికి పూర్తివేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మేరకు అన్ని రాష్ట్రప్రభుత్వాలను, కేంద్రపాలితప్రాంతాలను ఆదేశించాలని కేంద్రానికి సూచించింది. హెల్త్​ వర్కర్లకు వసతి కూడా కల్పించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్​ అశోక్​భూషన్​ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. కరోనా వ్యాధిగ్రస్థులకు వైద్యం అందించిన డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లను కచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచే విధంగా నిబంధనలు తీసుకురావాలని సూచించింది. రాష్ట్రాలు ఈ నిబంధనలు పాటించకపోతే […]

Read More