సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన తోట భాస్కర్ కు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ రూ.60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును సోమవారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ తల్లడి పుష్పలత కలసి భాస్కర్ కు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మెదక్ నియోజకవర్గ పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.15లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, నిజాంపేట్ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, కౌన్సిలర్ ఆర్ కే శ్రీనివాస్ […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఎదగాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలంలోని మార్కెట్ పల్లి గ్రామానికి చెందిన యాదగిరికి ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.15వేల సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, సర్పంచ్ రమ్యఅశోక్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దత్తు తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, దేవరకద్ర: పేద ప్రజలకు సంక్షేమపథకాలను అమలుచేయడంలో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొత్తకోటలో గ్రీన్ ఆగ్రో స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం భూత్పూరు మండలం అన్నసాగర్, మూసాపేట మండలకేంద్రంలో పలువరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.