Breaking News

CBSE

‘‘నవోదయ’’లో ప్రవేశాలకు నోటిఫికేషన్​

‘నవోదయ’లో ప్రవేశాలకు నోటిఫికేషన్​

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం నవోదయ విద్యాలయంలో 2020––21 అకాడమిక్ ఆరవ తరగతిలో చేరేందుకు విద్యార్థుల ప్రవేశపరీక్షకు శుక్రవారం నోటిఫికేషన్​విడుదలైందని ప్రిన్సిపల్ ​వీరరాఘవయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 80 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా పరిధిలో ఐదవ తరగతి చదివిన విద్యార్థులు ఆన్​లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. సీబీఎస్​ఈ బోధన ఉంటుంది. […]

Read More

టైలర్​ కూతురు టాపర్​

జంషడ్​పూర్​: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఓ విద్యార్థిని నిరూపించింది. జార్ఘండ్​ రాష్ట్రం జంషడ్​పర్​కు చెందిన నందితా హరిపాల్ సీబీఎస్​ఈ 12 వతరగతిలో ని ఆర్ట్స్​ విభాగంలో 83.8 శాతం మార్కులు సాధించి టాపర్​గా నిలిచింది. నందిత తండ్రి టైలర్​గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి కుటుంబం పేదరికంలో మగ్గుతున్నది. కూతురు నందిత జంషడ్​పూర్​ ఉమెన్స్​ కళాశాలలో విద్యనభ్యసించింది. ‘నేను టాపర్​గా నిలుస్తానని కలలో కూడా ఊహించలేదు. ఫలితాలు చూసి నాతోపాటు కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారు. నేను […]

Read More

సీబీఎస్‌ఈ టెన్త్​ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పదోతరగతి రిజల్ట్స్‌ విడుదలయ్యాయి. బుధవారం ఉదయం ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఉమాంగ్‌ యాప్‌, టోల్‌ఫ్రీ నంబర్‌‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఈ ఏడాది 91.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణతశాతం పెరిగింది. దాదాపు 41,804 మంది విద్యార్థులు 95 శాతం మార్కులు స్కోర్‌‌ చేశారు. సీబీఎస్‌ఈ ఇప్పటికే పన్నెండోతరగతి ఫలితాలు విడుదల చేసింది. కరోనా కారణంగా టెన్త్‌, పన్నెండోతరగతి పరీక్షలను […]

Read More

సీబీఎస్​ఈ ఫలితాలు విడుదల

ఢిల్లీ: సీబీఎస్​ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​) 12 వతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు మొత్తం 11,92,961 మంది హాజరుకాగా 88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేశ్​ పోబ్రియాల్​ ట్విట్టర్​లో అభినందనలు తెలిపారు. పరీక్షాఫలితాలను cbseresults.nic.inలో చూడవచ్చు. గత ఏడాది 83.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 5.38శాతం అధిక ఉత్తీర్ణత నమోదైంది. త్రివేండ్రంలో అత్యధికంగా 97.67 శాతం మంది, […]

Read More

సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్‌ రద్దు

న్యూఢిల్లీ: కరోనా ప్రబలుతున్న కారణంగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. గురువారం విచారణ జరిగిన సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన తుషార్‌‌ మెహతా ఈ విషయాన్ని కోర్టుకు చెప్పారు. జులై 1 నుంచి 15 వరకు జరగాల్సిన సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వాటితో పాటు ఐసీఎస్‌ఈ పరీక్షలను కూడా క్యాన్సిల్‌ చేశామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ, […]

Read More