Breaking News

CARONA

కొత్తగా 730 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 730 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,802కు చేరింది. ఆదివారం 225 మంది డిశ్చార్జ్​ అయ్యారు. యాక్టివ్​ కేసులు 3,861 ఉన్నాయి. మొత్తం 3,731 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 659 కరోనా పాజిటివ్​ కేసులు కేవలం జీహెచ్​ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. జనగామ జిల్లాలో 34 కేసులు, రంగారెడ్డి జిల్లా 10, మేడ్చల్​ జిల్లాలో 9 చొప్పును కేసులు […]

Read More

కరోనాకు మరో మందు

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా రోగులకు ఉపశమనం కలిగించేందుకు హెటిరో ఔషధ సంస్థ మరో మందును అందుబాటులోకి తెచ్చింది. శనివారం గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ ఫాబిఫ్లూ పేరుతో ఓ మందును విడుదల చేసింది. తక్కువ రోగ లక్షణాలు ఉన్నవారికి ఈ మెడిసిన్​ పనిచేస్తుందని వెల్లడించింది. కాగా తాజాగా హైదరాబాద్‌కు చెందిన హెటిరో ఫార్మా కంపెనీ కరోనా వైరస్‌కు జనరిక్ మందును కనిపెట్టినట్టు ప్రకటించింది. ‘కోవిఫర్’ పేరుతో ఈ మందును తయారు చేసినట్టు తెలిపింది. దీనికి డీసీజీఐ అనుమతి కూడా […]

Read More

కాంగ్రెస్​ నేత వీహెచ్​కు కరోనా

హైదరాబాద్‌ : కాంగ్రెస్ సీనియర్​ నేత, మాజీ ఎంపీ వీహెచ్​ (హనుమతంతరావు)కు కరోనా సోకింది. రెండ్రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ దవాఖానలో ఆయనకు చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్​ ఉన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటీవలే వందమందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ రోజు నుంచే వీహెచ్​ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. లాక్​డౌన్​లోనూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి సేవా […]

Read More

పరిశుభ్రతతో రోగాలు దూరం

సారథిన్యూస్, రామడుగు: వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని యూనిసెఫ్​ కో ఆర్డినేటర్​ కిషన్​స్వామి పేర్కొన్నారు. కరోన మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రజలంతా సహకరించాలని కోరారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో శనివారం సర్పంచ్ సాదు పద్మ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక పారిశద్ధ్య కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సారిక. అంగన్వాడీ కార్యకర్తలు, రమ, లత సంధ్యారాణి, ఉమ, రాణి, మమత, […]

Read More

బండ్ల గణేశ్​కు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పారు. బండ్ల గణేశ్​కు కరోనా సోకినట్టు గత రెండు, మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మీడియా ప్రతినిధులు శనివారం ఆయనను సంప్రదించగా తనకు కరోనా సోకినట్టు ధ్రువీకరించారు. ప్రస్తుతం హోం క్వారైంటైన్​ లో ఉన్నానని ఆయన చెప్పారు. త్వరలో అపోలో లేదా కాంటినెంటల్​ హాస్పిటల్​లో చేరనున్నట్టు తెలిపారు. ఇటీవల […]

Read More

జోనల్‌ కమిషనర్‌కు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచడంతో కరోనా కేసులూ భారీగా నమోదవుతున్నాయి. గురువారం ఏకంగా 352 మందికి పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో 300 మందికిపైగా పాజిటివ్‌ నమోదవడం ఇదే తొలిసారి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 303 కేసులు వచ్చాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌కు వైరస్‌ సోకింది. 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో నివాసం ఉండే సదరు ఐఏఎస్‌ అధికారిణి.. ప్రస్తుతం […]

Read More

వైద్య సిబ్బందికి కరోనా టెస్టులు

సారథిన్యూస్​ ములుగు: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లాలోని వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న 25 మంది వైద్య సిబ్బంది శాంపిల్స్​ సేకరించారు. శాంపిళ్లను పరీక్షల కోసం వరంగల్​లోని కాకతీయ మెడికల్ ల్యాబ్ కు పంపామని చెప్పారు.

Read More

పోలీసులను వదలడం లేదు

సారథిన్యూస్​, హైదరాబాద్: రాష్ట్రంలోని పోలీసులను కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఎస్​ఆర్​నగర్​లో పీఎస్​లో విధులు నిర్వర్తిస్తున్న మరో 9 మందికి కూడా కరోనా పాజిటివ్​గా తేలింది. ఒక క్రైంఎస్ఐ, ఏఎస్‌ఐ, ఏడు మంది కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అధిక సంఖ్యలో పోలీసులు కరోనా […]

Read More