Breaking News

AMARAVATHI

ఏపీలో 9,996 కరోనా కేసులు

ఏపీలో 9,996 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో గురువారం కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారిన పడి తాజాగా 82 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2,378కు చేరింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ ​కేసులు 2,64,142కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 90,840కు చేరింది. వ్యాధిబారిన పడి 24 గంటల్లో 9,499 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,70,924 మంది కోలుకున్నారు. ఇక వ్యాధి తీవ్రతను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,504 […]

Read More
ఏపీలో 9,597 కరోనా కేసులు

ఏపీలో 9,597 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం 9,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 93 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 2,296కు చేరింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,54,146కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించారు. తాజాగా వ్యాధిబారిన నుంచి 6,676 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,61,425కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం […]

Read More
మండలి రద్దుపై జోక్యం చేసుకోలేం

‘మండలి రద్దుపై జోక్యం చేసుకోలేం’

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో మండలి రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ శాసనమండలిలో టీడీపీకి మెజార్జీ ఉండడంతో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను మండలి అడ్డకుంటున్నది. దీంతో తీవ్ర అసహనానికి లోనైన సీఎం జగన్​ ఏకంగా మండలినే రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. మండలి రద్దు అంశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉంది. ఇదే సమయంలో మండలిని రద్దు చేయాలని అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా దాఖలైన […]

Read More
12 మంది సబ్‌ కలెక్టర్లుగా నియామకం

12 మంది సబ్‌ కలెక్టర్లుగా నియామకం

అమరావతి: ప్రొబేషనర్(2018 బ్యాచ్) ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్‌లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మందిని సబ్ కలెక్టర్‌లుగా నియమించింది. చిత్తూరు డీఆర్డీఏ పీవోగా ఎంఎస్ మురళి నియమితులయ్యారు. అలాగే ప్రస్తుతం రాజంపేట, నరసరావుపేట, కందుకూరు, నూజివీడు, నంద్యాల, టెక్కలి, నర్సీపట్నంలో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్‌లను జీఏడీకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. సబ్‌ కలెక్టర్లుగా నియమితులైన వారి వివరాలు పృథ్వీ తేజ్ ఇమ్మడి – సబ్ కలెక్టర్ కడప (కడప), ప్రతిష్ఠ […]

Read More
ఏపీలో ‘ఎమ్మెల్సీ’ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ‘ఎమ్మెల్సీ’ నోటిఫికేషన్ విడుదల

అమరావతి : ఏపీ ‌లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 13 కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. […]

Read More
బాబు ఉక్కిరిబిక్కిరి

చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి

అమరావతి: కేంద్రప్రభుత్వం తాజా నిర్ణయంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్​ రాజధాని వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తేల్చిచెప్పింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని భావించిన టీడీపీకి ప్రస్తుత బీజేపీ నిర్ణయంతో ఆశలు అడుగంటాయి. రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని పీవీ కృష్ణయ్య అనే వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన […]

Read More
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణీతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంద్రా, యానాం తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది.

Read More
ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం

ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం

అమరావతి: సీఆర్​డీఏ స్థానంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ(ఏఎంఆర్​డీఏ) కమిషనర్​గా పి.లక్ష్మీనరసింహంను నియమించారు. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన సీఆర్డీఏ కమిషనర్​గా కొనసాగుతున్నారు.

Read More