సారథి న్యూస్, రామగుండం: ఏఐటీయూసీ నాయకుడు గట్టయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగరేణి రామగుండం జీఎంపై చర్యలు తీసుకోవాలని కార్మికసంఘాల నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు అధికారుల తీరుతో కార్మికులతో యాజమాన్యానికి సత్సంబంధాలు లేకుండా పోతాయని.. అంతిమంగా సింగరేణి యాజమాన్యానికి ఎంతో నష్టం చేకూరుతుందని చెప్పారు. కార్మికులతో స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరపాలని వారు పేర్కొన్నారు.
సారథిన్యూస్, కోదాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 3న తలపెట్టిన ఐక్య కార్మిక సంఘాల ధర్నాను జయప్రదం చేయాలని కార్మికసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఐక్యకార్మిక సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఉదయగిరి, ఐఎన్టీయూసీ నాయకులు కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మికసంఘాలు, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(scks) డిమాండ్ చేసింది. గురువారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ’బ్లాక్‌డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజా రెడ్డి, మెండె శ్రీనివాస్, సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, జే గజేంద్ర, బీ శ్రీనివాసరావు, నంది నారాయణ, బీ రవి, […]
కార్మిక సంఘాల జేఏసీ నేతలు సారథి న్యూస్, పెద్దపెల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు, చట్టాలను కాలరాస్తున్నాయని నిరసిస్తూ.. ఏఐటీయూసీ, సీఐటీయూ ఐఎఫ్ టీయూ తదితర కార్మిక సంఘాల జేఏసీ దేశవ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కేంద్రప్రభుత్వం కార్మికుల చట్టాలను రద్దు చేయడం సరికాదన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోతారని, పనికి, ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ […]