సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా వైరస్ విజృంభించకుండా కట్టడి చేయడంతో పాటు ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించి ప్రజలకు వివరించాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నియోజకవర్గ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్ నుంచి జూమ్యాప్ లో ఉప్పునుంతల ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో, ఎస్సై, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. కరోనా కాలంలో అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా చూడాలని కోరారు.
సారథి న్యూస్, నాగర్కర్నూల్: తేనె సేకరణకు వెళ్లిన ఇద్దరు చెంచు యువకులు చెట్టుకు కట్టిన తాగు తెగిపోయి లోయలోపడి చనిపోయారు. ఈ దుర్ఘటన శనివారం నాగర్కర్నూల్జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి సమీప అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదివాసీ చెంచులు దాసరి బయన్న(35), దాసరి పెద్దలు(28), దాసరి వెంకటయ్య కలిసి నల్లమల అటవీ ప్రాంతంలోకి తేనె సేకరణకు వెళ్లారు. చెట్టుకు కట్టిన తాడు ప్రమాదవశాత్తు తెగిపోవడంతో ముగ్గురూ లోయలో పడిపోయారు. వారిలో దాసరి బయన్న, దాసరి […]
సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం విక్రయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన విషయం తెలిసిందే. కానీ ఎక్సైజ్ అధికారులను మచ్చిక చేసుకుని తమ చీకటిదందా కొనసాగించాలని భావించిన కొందరు మద్యం వ్యాపారులు వారికి విందు భోజనాలు ఏర్పాటుచేశారు. అధికారులు కూడా తనిఖీల పేరుతో తమ పని కానిచ్చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శుక్రవారం వెలుగుచూసిన ఈ ఘటన.. ఎక్సైజ్ అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. అచ్చంపేటలో మద్యం వ్యాపారులంతా ఎక్సైజ్ […]