Breaking News

TELANGANA

జెండాపండుగ మరిచారు

సారథి న్యూస్, రామడుగు: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుంటే.. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో మాత్రం జెండా ఎగురవేయలేదు. కాగా ఈ విషయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జెండాపండుగను మరిచిపోయారని వారు విమర్శిస్తున్నారు. విజ్ఞానం పంచి మేధావులను తయారు చేసే గ్రంథాలయంలో జండా ఎగరవేయక పోవటం ఏమిటని గ్రంథపాలకుడి తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read More
ఊరూరా జెండా పండుగ

ఊరురా జెండా పండుగ

సారథి న్యూస్​, నెట్​వర్క్​: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కేవలం కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పరిమిత సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే వేడుకలకు హాజరయ్యారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో స్వేరోస్​ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్నినారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనరేట్​లో కమిషనర్​ వి.సత్యనారాయణ జెండాను ఎగురవేశారు. కరీంనగర్​ జిల్లా రామడుగు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పంజాల […]

Read More
వర్షాలు కురుస్తున్నయ్​.. అలర్ట్​గా ఉండండి

వర్షాలు కురుస్తున్నయ్​.. అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నందున వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి, మంత్రులతో శనివారం మాట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ​మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తుండడంతో చాలా చెరువులు అలుగుపోస్తున్నాయని, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయని, చాలాచోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరిందన్నారు. హైదరాబాద్ లో రెండు కంట్రోల్ రూమ్ లను […]

Read More
నిరాడంబరంగా ఇండిపెండెన్స్​డే

నిరాడంబరంగా ఇండిపెండెన్స్​ డే

సారథి న్యూస్​టీం: 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సెల్యూట్​చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అసెంబ్లీ అవరణలో నిర్వహించిన వేడుకల్లో స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి కలెక్టరేట్​లో జరిగిన సంబరాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సూర్యాపేట కలెక్టరేట్​లో జరిగిన వేడుకల్లో మంత్రి జి.జగదీశ్వర్​రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్​లో […]

Read More
ప్లాస్మా దానం చేయండి

ప్లాస్మా దానం చేయండి

సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో కోవిడ్​ టెస్టింగ్ ​ల్యాబ్​ను మంత్రి టి.హరీశ్​రావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట మున్సిపల్ ఆఫీసు ఆవరణలో కరోనా మొబైల్ టెస్టింగ్ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనాను జయించినవారు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్​ అధికారులు పాల్గొన్నారు.

Read More

తెలంగాణకు కాసులపంట

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు కాసులపంట పడింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ల శాఖ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ నెలలో 12రోజుల ఆదాయం రూ.106 కోట్లు దాటింది. అయితే, సెలవులు పోను ఆరు రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. ఈ లెక్కన రోజువారీ ఆదాయం సగటున దాదాపు రూ.18 కోట్లకు చేరింది. కరోనాకు ముందు రాష్ట్రంలో రోజూ ఐదువేల రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరిగేవి. సగటున రూ.20కోట్ల వరకు ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌ కారణంగా […]

Read More
తెలంగాణలో కరోనా

తెలంగాణలో 1,921 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 1,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 88,396కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ ను విడుదల చేసింది. తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 674కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,210 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి […]

Read More

తెలుగు రాష్ట్రాల్లో మస్తు​ వానలు

సారథి న్యూస్, హైదరాబాద్, అమరావతి: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రెండు రోజులుగా మసురు పట్టింది. ఐదురోజుల పాటు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్ […]

Read More