Breaking News

TELANGANA

రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీళ్లు

రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీళ్లు

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిషన్ భగీరథ నీటిని మాత్రమే ప్రజలు వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు మరిన్ని రూపొందించాలని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల సీఈలు, ఎస్ఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్తగా నిర్మిస్తున్న రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీటిని అందించాలని సూచించారు. అంగన్​వాడీ కేంద్రాలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ధార్మిక సంస్థలకు వాటర్ కలెక్షన్లు […]

Read More
బైండ్ల కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

బైండ్ల కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

సారథి న్యూస్​, ఎల్బీనగర్(రంగారెడ్డి): బైండ్ల కులస్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేయాలని, తాను కులస్తుల విద్య, ఉపాధి, సమగ్ర అభివృద్ధికి నిరంతరం శ్రమించి పనిచేస్తానని తెలంగాణ బైండ్ల(భవనీయ)సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుల్ల గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ బైండ్ల కులస్తుల రాష్ట్రస్థాయి సమావేశం హయత్ నగర్ లోని బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ లో కడియం రామచంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఉపకులాల్లో అత్యధిక జనాభా కలిగిన బైండ్ల కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని […]

Read More
నిరుద్యోగులకు సీఎం తీపికబురు

నిరుద్యోగులకు సీఎం తీపికబురు

సారథి న్యూస్, హైదరాబాద్​: సీఎం కె.చంద్రశేఖర్​రావు నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50వేల మేర ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తీచేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్​మెంట్​ జరగాల్సి […]

Read More
వైభవంగా గోరెటి వెంకన్న కూతురు పెళ్లి

వైభవంగా గోరెటి వెంకన్న కూతురు పెళ్లి

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన ప్రజావాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూతురు వివాహానికి సీఎం కె.చంద్రశేఖర్​రావు ముఖ్య​అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, మున్సిపల్​, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు, ఎల్​బీ నగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి, నిజామాబాద్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Read More
సిద్దిపేటలో కేసీఆర్​నగర్​

సిద్దిపేటలో కేసీఆర్​ నగర్​

సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ అభివృద్ధి పనులకు గురువారం ప్రారంభోత్సవం చేయనున్నారు. సిద్దిపేటలో నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల సముదాయానికి కేసీఆర్ నగర్ గా నామకరణం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. రూ.163 కోట్ల వ్యయంతో 2,460 ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తొలి విడతలో 1, 341 ఇళ్లు, రెండో విడత వెయ్యి ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ […]

Read More
నా బిడ్డ పెండ్లికి రండి

నా బిడ్డ పెండ్లికి రండి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్ని వినిపించిన రైతు పనికర మల్లయ్య తన కుమార్తె పెళ్లి ఆహ్వాన పత్రికను తీసుకుని హైదరాబాద్​కు వచ్చి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా సోమవారం ప్రగతిభవన్ లో అందజేశారు. వేడుకలకు ముఖ్యమంత్రిని రావాల్సిందిగా కోరగా.. వారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను కోరుకున్న రైతు తెలంగాణను నడిపిస్తున్నారనే సంతోషంతో నాటి ఉద్యమ సారథి సీఎంను తన కూతురు […]

Read More
భారతరత్న డాక్టర్​బీఆర్​అంబేద్కర్​కు ఘననివాళి

భారతరత్న డాక్టర్ ​బీఆర్​ అంబేద్కర్​కు ఘన నివాళి

సారథి న్యూస్, హైదరాబాద్: భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆదివారం అసెంబ్లీ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి శాసనసభ స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ​బీఆర్​ అంబేద్కర్​దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు గొంగడి సునిత, రేగా కాంతారావు, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, […]

Read More
శ్రీకాంతచారికి ఘననివాళి

శ్రీకాంతచారికి ఘననివాళి

సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు దివంగత కాసోజు శ్రీకాంతచారి 11వ వర్ధంతి సందర్భంగా మోత్కూరు మండలం పొడి చెడు గ్రామంలో ఆయన విగ్రహానికి మంత్రులు ఈటల రాజేందర్, గుంటకండ్ల జగదీశ్వర్​రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More