Breaking News

CARONA

పంజాబ్​ మంత్రికి కరోనా

చంఢీగర్​: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్నది. రాజకీయ, సినీప్రముఖులను వదలడం లేదు. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా వైరస్​ విజృంభిస్తున్నది. తాజగా పంజాబ్​ మంత్రి రాజిందర్​ సింగ్​ బజ్వాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరాణ అయ్యింది. ఆయన కార్యాలయంలోని కొందరికి కరోనా రావడంతో శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్​గా వచ్చింది. అయినప్పటికి ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో మంగళవారం మరోసారి కరోనా పరీక్షచేయగా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మంత్రికి పాజిటివ్​ రావడంతో ఆయన కుటుంబసభ్యుల […]

Read More

9 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: భారత్​లో కరోనా కేసులో సంఖ్య భయంకర స్థాయిలో పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,429 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,36,181 కి చేరింది. ఈ కాగా ఒకే రోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కరోనాతో 24,309 మంది మృత్యువాత పడ్డారు. 5,92,031 మంది కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో 3,19,840 మంది చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read More

రామడుగులో కరోనా కలకలం

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో రామడుగు మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెదిర గ్రామంలో మంగళవారం శానిటైజేషన్​ నిర్వహించారు. గ్రామంలోని విధులను శుభ్రపరిచారు. ప్రజలంతా సామాజికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Read More

సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి

సారథి న్యూస్, కర్నూలు: కరోనా వ్యాప్తి సమయంలో సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు.మంగళవారం కర్నూలు నగరంలోని రీజినల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు. సైబర్​నేరగాళ్లు మాయమాటలతో మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం(ఇంటి నుంచి ఉద్యోగాలు) ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫేక్ ఐడీలు, ఫేక్ వెబ్ సైట్లతో ఆన్ లైన్ లో ఉద్యోగాలు చేసే […]

Read More

కరోనాతో 10 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో అదేస్థాయిలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. మంగళవారం 1,524 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 37,745 కు కరోనా కేసులు చేరాయి. తాజాగా మహమ్మారి బారినపడి 10 మృతిచెందారు. చికిత్స అనంతరం ఒకేరోజు 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు.జీహెచ్ఎంసీ పరిధిలో 815 పాజిటివ్ నమోదయ్యాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 375కు చేరింది. ఇప్పటివరకు 1, 95, 024 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి 240, మేడ్చల్ 97, […]

Read More

ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ

కరోనా రోగులు భయపడాల్సిన అవసరం లేదని.. డాక్టర్లు సూచించిన మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నయం చేసుకోవచ్చని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు హోంఐసోలేషన్​ కిట్లను పంపిణీ చేశారు. కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్కుల ధరించాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​, మేయర్​ పాపాలాల్​, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్​పర్సన్​ లింగాల […]

Read More

సారా అలీఖాన్​ డ్రైవర్​కు కరోనా

బాలీవుడ్​ స్టార్​హీరో సైఫ్​ అలీఖాన్​ కూతురు, నటి సారా అలీఖాన్​ డ్రైవర్​కు కరోనా సోకింది. దీంతో సైఫ్​అలీఖాన్​ కుటుంబసభ్యులు భయందోళనకు గురయ్యారు. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోగా వారందరికీ నెగెటివ్​ వచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని నేరుగా సారా ట్వట్టర్​ ద్వారా తెలియజేశారు. మరోవైపు ముంబైలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. రోజుకు వేలల్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి. బాలీవుడ్​ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా వైరస్ సోకింది. ఈ […]

Read More

ఢిల్లీలో తగ్గుతున్న కేసులు

ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,246 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత 35 రోజుల్లో ఇంత తక్కువ కేసులు రావడం ఇదే ప్రథమం. కాగా ఇక్కడ కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. 91,312 మంది కరోనా చికిత్సపొంది కోలుకున్నారు. రికవరి రేటు 80.28 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు తెలిపారు. అధికంగా టెస్టులు చేయడం, పాజిటివ్​ రోగులకు మెరుగైన వైద్యం చేయడంతోనే కరోనా అదుపులో […]

Read More