Breaking News

CARONA

అపోహలు వీడి టీకా వేయించుకోండి

అపోహలు వీడి టీకా వేయించుకోండి

సారథి, మానవపాడు: మానవపాడు సర్పంచ్​ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి కరోనా టీకా వేసుకున్నారు. ఎలాంటి అపోహలకు భయపడకుండా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆత్మ లింగారెడ్డి కోరారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్​ సవిత, హెల్త్ సూపర్ వైజర్ చంద్రన్న, ఫార్మసిస్ట్ తీరుమల్, స్టాఫ్ నర్స్ మహాలక్ష్మి, ఏఎన్​ఎం మున్ని, షాజహాన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సోని, ఆశా వర్కర్లు ఉన్నారు.

Read More
కరోనా సెకండ్​ వేవ్​.. మీటింగ్​లకు నో పర్మిషన్​

కరోనా సెకండ్​ వేవ్​.. మీటింగ్​లకు నో పర్మిషన్​

సారథి, రామడుగు: కొద్దిరోజులుగా కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ ఉధృతి పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని నిషేధాజ్ఞలు జారీచేసిందని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రామడుగు ఎస్సై గొల్లపల్లి అనూష హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఆదేశాలను మండల ప్రజలు కచ్చితంగా పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, ర్యాలీలు, ధర్నాలకు పర్మిషన్​ లేదని హెచ్చరించారు. […]

Read More
స్కూలు, కాలేజీల్లో కరోనా టెస్టులు

స్కూలు, కాలేజీల్లో కరోనా టెస్టులు

సారథి న్యూస్, వాజేడు: వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ లోని విద్యార్థులు, టీచర్లు, సిబ్బందికి, అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ స్టాఫ్​, స్టూడెంట్స్​కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. డాక్టర్​ యుమున ఆధ్వర్యంలో అనంతరం కోయవీరపురం, దూలపురం, కొంగల గ్రామాల్లో మెడికల్​ టెస్టులు చేశారు. మొత్తం 75మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, అందరికీ నెగటివ్ గా రిపోర్ట్​ వచ్చింది. కార్యక్రమంలో డాక్టర్ యమున, సీఎచ్ వో. సూర్యప్రకాష్, […]

Read More
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించించాలని కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్​వొడితల షమిత ఆకాంక్షించారు. సోమవారం హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాదని, వారంతా చైతన్యవంతులై అన్నిరంగాల్లోనూ రాణించాలన్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో మహిళలకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. కొడుకుతో సమానంగా కూతుళ్లను చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, నేటి పోటీ ప్రపంచాన్ని ఎదురుకునే విధంగా మహిళలు […]

Read More
విద్యార్థుల వద్దకే టీచర్లు

విద్యార్థుల వద్దకే టీచర్లు

సారథి న్యూస్, రామడుగు: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా కారణంగా విద్యావ్యవస్థ సమూలంగా దెబ్బతిన్నది. దీంతో విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారింది. ఈ తరుణంలో పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు హోమ్ ట్యూషన్ ను ఆశ్రయిస్తున్నారు. అందులో భాగంగానే రామడుగు మండల కేంద్రంలో పిల్లలను హోమ్ ట్యూషన్ పంపించే క్రమంలో రోడ్డు దాటించడం ఇబ్బందిగా మారడం, సరైన సమయంలో పేరెంట్స్​ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల వద్దకే ఉపాధ్యాయులు స్వయంగా వచ్చి పాఠాలు […]

Read More
కరోనా.. ఆంక్షల సడలింపు

కరోనా.. ఆంక్షల సడలింపు

హైదరాబాద్: కరోనా కేసులు తుగ్గుముఖం పట్టడంతో కేంద్రప్రభుత్వం కొన్ని ఆంక్షలను సడలించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చింది. జనవరి 31వ తేదీ నాటికి గతంలో విధించిన నిబంధనల గడువు ముగియనుంది. కేంద్ర హోంశాఖ బుధవారం కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సినిమా హాళ్లు, థియేటర్లు గరిష్ట సీటింగ్ సామర్థ్యంతో ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఇప్పటివరకు వీటిని 50 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతిచ్చారు. […]

Read More
కరోనా వ్యాక్సిన్​ వచ్చేసింది..

కరోనా వ్యాక్సిన్ ​వచ్చేసింది..

సారథి న్యూస్, మెదక్: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ మన చెంతకు వచ్చేసింది. శనివారం మెదక్ ​జిల్లా ప్రధాన ఆస్పత్రిలో మొదటి ప్రాధాన్యతగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్-19 టీకా వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​ హేమలత శేఖర్​గౌడ్ ​ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ మీట్ లో పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనాను నియంత్రించేందుకు టీకా వేసే కార్యక్రమం ప్రారంభించుకోవడం అద్భుతమని అన్నారు. ఇమ్యునిటీని పెంచే […]

Read More
స్కూళ్లను త్వరగా ఓపెన్​ చేయాలి

స్కూళ్లను త్వరగా ఓపెన్​ చేయాలి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: కరోనా నేపథ్యంలో మూతబడిన స్కూళ్లను తగిన జాగ్రత్తలు పాటిస్తూ పునఃప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలాధ్యక్షుడు గిరిబాబు కోరారు. సోమవారం ఆయన ఎంపీడీవో గణేష్ రెడ్డి చేతుల మీదుగా టీఎస్ యూటీఎఫ్​ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలస్యం చేయకుండా ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ద్వారా విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుపతి, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఫణింద్రచారి, ఉపాధ్యాయులు రామబ్రహ్మకుమార్, విఠోబా, స్వామి, ప్రవీణ్ […]

Read More