సారథి, చొప్పదండి: రాష్ట్రంలో స్కూళ్లను వెంటనే తెరవాలని, పిల్లలందరికీ తక్షణమే వ్యాక్సిన్ఇచ్చి వారి భవిష్యత్ దృష్ట్యా ఆన్లైన్ క్లాసులకు స్వస్తి పలకాలని, స్కూళ్లలో సరైన జాగ్రత్తలు తీసుకొని విద్యాబోధన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తు విజయ్ కుమార్ కోరారు. గురువారం ఆయన చొప్పదండి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ఏడాదికిపైగా బోధనకు దూరంగా ఉండటం ద్వారా విద్యార్థులు చదువులో వెనుకబడటంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని అన్నారు. […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో రామచంద్రం అనే వ్యక్తి కరోనాతో బాధపడుతుండగా చిరంజీవి అభిమానులు అతనికి ఆక్సిజన్కాన్సంట్రేటర్ను శనివారం అందజేశారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు మారం ప్రవీణ్ కుమార్, అరుణ్ తేజ చారి, విజయ్, కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, అగయ్య తదితరులు పాల్గొన్నారు.
సారథి, వేములవాడ: కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వేములవాడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు లాయక్‌పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని చెక్కపల్లి రోడ్డులో సర్వేనం.112 […]
సారథి, వేములవాడ: కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ఎస్సై మాలకొండ రాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది హన్మజిపేట గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని, శానిటైజర్వాడాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలని మాట, పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా మండలం రుద్రారం గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్, ధర్మజాగరణ సంస్థ ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ ఉదారత చాటుకున్నారు. చిలుముల జలజ, పర్షిత, సుంకే అనిత, రంగశాయిపల్లి గ్రామానికి చెందిన నిరుపేదలు వేముల జ్యోతి, చిలుముల హన్మయ్యకు బుధవారం కరోనా కిట్స్, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గుర్రం దేవిక, ధర్మజాగరణ సంస్థ సమన్వయకర్త పాకాల రాములుగౌడ్, రాజశేఖర్ గౌడ్ తదితరులు […]
సారథి, పెద్దశంకరంపేట: ఇటీవల కరోనా బారినపడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు ఆర్ఎస్ఎస్ నిరుపేద కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు సేవాభారతి ఆధ్వర్యంలో మంగళవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సీతారామారావు, రవివర్మ, సతీష్ గౌడ్, జైహింద్ రెడ్డి, సర్వేశ్వర్, కృష్ణమూర్తి, విశ్వేశ్వర్ గౌడ్, శ్రీహరి, మధు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
సారథి, ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్క గొప్ప హృదయం చాటుకున్నారు. ఇటీవల మరణించిన కుటుంబాలను ఆదివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కైసర్ పాషా కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే గరా రాములు కుటుంబానికి రూ.రెండువేల చొప్పున సాయం చేశారు. అలాగే కరోనాతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరుసవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్ […]
సారథి, రామడుగు: కరోనా మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేసింది. ఈ సమయంలో బడుగు జీవులకు ఆపన్నహస్తం అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు ఎందరో మహానుభావులు. ఆదరణ సేవాసమితి, సర్వ్ టూ సొసైటీ సంయుక్తంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. వారి చదువు పూర్తయినందున ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొక్కెరకుంట గ్రామంలో […]