సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేయొచ్చని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. క్యాబినెట్ తీసుకొనే విధానపరమైన నిర్ణయాలను తప్పు పట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లితుందని కాంగ్రెస్ కోర్టుకు వెళ్లారు. విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అడ్డకోకుడదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది.