Breaking News

హరితహారం

నిరాడంబరంగా హరితహారం

సారథిన్యూస్​, నెట్​వర్క్​: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరాడంబరంగా ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, చింతకాని మండలాల్లో జెడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజ్​, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్​ కొండబాల కోటేశ్వర్​రావు మొక్కలు నాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం క్రాస్ రోడ్ లో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​, జిల్లా కలెక్టర్​ […]

Read More

హరితహారం స్వర్ణహారం కావాలి

సారథి న్యూస్, అలంపూర్: ఆలంపూర్ జోగుళాంబ పుణ్యక్షేత్రం ఆవరణలో మొక్కలు నాటి ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్​చైర్మన్​వెంకటేశ్, కమిషనర్​మదన్​మోహన్​గురువారం ప్రారంభించారు. హరితహారం స్వర్ణహారం కావాలని వారు ఆకాంక్షించారు. మున్సిపాలిటీలో ఒక్కో వార్డులో వంద మొక్కల చొప్పున నాటడమే కాకుండా ప్రతి ఇంటికి మూడు మొక్కల చొప్పున నాటాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ ఆఫీసుల మైదానాల్లో మొక్కలు నాటాలని సంకల్పించారు. అంతకుముందు ప్రభుత్వ జూనియన్​ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పుష్పలత, జయలక్ష్మి, టీఆర్ఎస్ […]

Read More

అల్లనేరేడు మొక్క నాటిన సీఎం కేసీఆర్​

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ లో అల్లనేరేడు మొక్కలను నాటి ప్రారంభించారు. స్థానిక పార్కులో అనేక విశిష్టతలు ఉన్నాయి. సుమారు 630 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ ప్రాంతం విస్తరించి ఉంది. రూ.8కోట్ల వ్యయంతో 15కి.మీ. ప్రహరీని సిత్రు వాల్, చైన్ లింక్ ఫినిషింగ్ తో నిర్మాణ చేపట్టారు.

Read More

30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్​రెడ్డి వివరించారు. గురువారం మెదక్​జిల్లా నర్సాపూర్​అటవీ ప్రాంతంలో సీఎం కేసీఆర్​మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం మంత్రి హరీశ్​​రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్​రెడ్డి, మెదక్​జిల్లా కలెక్టర్​ధర్మారెడ్డి కలిసి అటవీప్రాంతాన్ని పరిశీలించారు. నర్సాపూర్ అర్బన్​పార్కులో సీఎం ఆరు మొక్కలు నాటుతారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 182 […]

Read More

హరితహారానికి అంతా రెడీ

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం నిర్వహించే ఆరో విడత హరితహారం కార్యక్రమానికి అంతా రెడీచేశామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే కాలనీలోని విజయ నర్సరీని బుధవారం ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. 29 నర్సరీలు 50 లక్షల మొక్కలతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్​నగర ప్రజలు విరివిగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు

Read More

25 నుంచి ఆరో విడత హరితహారం

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈనెల 25న ప్రారంభించే ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం లేఖలు రాశారు. ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని కోరారు. హరితహారంలో ఇప్పటి వరకు 182 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు.

Read More

హైవేల వెంట పూల మొక్కలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని నేషనల్​హైవేల వెంట ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎర్రమంజిల్ ఆర్అండ్ బీ ఆఫీసులో సమీక్షించారు. రోడ్లకు ఇరువైపులా ఆహ్లాదకరమైన మొక్కలు ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్​ఆదేశాలు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర పరిధిలోని నేషనల్ హైవేలపై 50వేల మొక్కలు, 25 కలెక్టరేట్లలో వెయ్యి మొక్కల చొప్పున మొత్తం 75వేల మొక్కలను హరితహారంలో నాటేందుకు ప్రణాళికలు […]

Read More

ఇంటింటికీ మొక్కలు పంపిణీ

సారథి న్యూస్​, ములుగు: వెంకటాపురం మండలంలోని మరికాల గ్రామంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంగళవారం పర్యటించారు. హరితహారంలో భాగంగా మరికాల పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామంలోని ప్రతి ఇంటికి పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని డంపింగ్ యార్డ్ పనులు, రైతు వేదిక పనులు పరిశీలించారు. ఆయన వెంట నుగూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బుచ్చయ్య, జడ్పీటీసీ రమణ, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో అనురాధ ఉన్నారు.

Read More