Breaking News

సీడీపీవో

ఇంటి వద్దకే అంగన్​వాడీ సరుకులు

ఇంటి వద్దకే అంగన్​వాడీ సరుకులు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఇంటివద్దకే వెళ్లి నేరుగా అంగన్​వాడీ సరుకులను అందజేస్తామని అల్లాదుర్గం సీడీపీవో భార్గవి తెలిపారు. బుధవారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలోని పూసలగల్లీ, తిరుమలాపూర్ అంగన్​వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజు ఐదుగురు చిన్నారుల బరువు తూకం వేయాలని, అంగన్​వాడీ కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. టీ షాట్ ద్వారా ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు ప్లే ఆక్టివిటీపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్​వాడీ టీచర్లు సరళ, స్వరూప, అనురాధ […]

Read More
ప్రభుత్వ భవనాల్లోనే అంగన్​వాడీ సెంటర్లు

ప్రభుత్వ భవనాల్లోనే అంగన్​వాడీ సెంటర్లు

సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ భవనాల్లోనే అంగన్​వాడీ సెంటర్లు ఉండాలని, అందుకు ‘నాడు..నేడు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళాశిశు సంక్షేమశాఖ, ఐసీడీఎస్​ పథక సంచాలకులు డాక్టర్​జి.జయలక్ష్మి సీడీపీవోలను ఆదేశించారు. శనివారం ఉదయం ఆమె సమీక్షించారు. అంగన్​వాడీ సెంటర్లకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నివేదిక తమకు అందిస్తే వాటిని జేసీకి పంపిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల మరమ్మతులకు సంబంధించి అంచనాల వివరాలను తమకు పంపించాలని సూచించారు.

Read More

అంగన్వాడీ టీచర్ల భర్తీ

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో, ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల భర్తీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్​ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 548 ప్రధాన, 92 చిన్న అంగన్వాడీ కేంద్రాలున్నట్లు తెలిపారు. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో 51 టీచర్లు, 132 ఆయాలు, చిన్న అంగన్వాడీ కేంద్రాల్లో 45 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. వెంటనే ఖాళీల […]

Read More