సారథి న్యూస్, కర్నూలు: పోలీసుశాఖలోని (సీఐడీ) కర్నూలు ప్రాంతీయ ఫింగర్ ప్రింట్ బ్యూరో సీఐగా పనిచేస్తున్న శివారెడ్డికి డీఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ఫక్కీరప్పను జిల్లా పోలీసు ఆఫీసులో కలిసి బొకే అందజేశారు.
పవర్‌హౌస్ ప్రమాదంపై సీబీఐ ఎంక్వైరీ చేయించండి నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే శ్రీశైలం దుర్ఘటన సీఎం కేసీఆర్‌కు రేవంత్, మల్లు రవి, వంశీకృష్ణ లేఖ సారథి న్యూస్, హైదరాబాద్: శ్రీశైలం పాతాళగంగ పవర్‌హౌస్ ఘటనపై అన్ని వేళ్లూ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయని, సీఐడీ విచారణలో విశ్వసనీయత లేదని కాంగ్రెస్ నేతలు, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సి.వంశీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు బుధవారం లేఖ రాశారు. నిర్లక్ష్యం, అవినీతి […]