Breaking News

సీఎం కేసీఆర్

ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ

ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ

సారథి ప్రతినిధి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయూ కుదుర్చుకున్నది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారుచేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ  వైద్యసేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ […]

Read More
30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా దృష్ట్యా అమల్లో ఉన్న లాక్ డౌన్ ను ఈనెల 30వ తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులతో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి అభిప్రాయం మేరకు లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో […]

Read More
ముస్లింలకు రంజాన్ కానుక

ముస్లింలకు రంజాన్ కానుక

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం బండపల్లిలో రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ రంజాన్ కానుకను ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం అందజేశారు. బండపల్లిలో స్థానిక సర్పంచ్ న్యాయ విజయ జార్జ్ ఆధ్వర్యంలో వాటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసారపు గంగాధర్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మల్యాల గంగానర్సయ్య, వార్డు సభ్యులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, టెంపుల్ చైర్మన్ గడ్డం సంజీవరెడ్డి, ముస్లింలు పాల్గొన్నారు.

Read More
ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

సారథి, హైదరాబాద్: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 19న ఆయనకు కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన గజ్వేల్‌లోని తన ఫాంహౌజ్‌లోనే ఐసోలేషన్‌లో ఉండిపోయారు. 28న ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో వైద్యులు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా, నెగెటివ్ అని వచ్చింది. 29న ఆర్టీపీసీఆర్‌లో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చివరికి మే 4న  కరోనా నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారని వ్యక్తిగత వైద్యులు ధ్రువీకరించారు. […]

Read More
మంత్రి కేటీఆర్​కు కరోనా పాజిటివ్​

మంత్రి కేటీఆర్​కు కరోనా పాజిటివ్​

సారథి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శుక్రవారం ఆయన ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్పగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. ‘స్వల్ప లక్షణాలతో నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోంఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కోవిడ్ […]

Read More
ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ

ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ చేసినట్లు సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు మూతపడ్డాయన్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల రోడ్డున పడడంతో సీఎం కేసీఆర్ రూ.రెండువేల నగదు వారి బ్యాంక్ అకౌంట్ లో వేయడమే కాకుండా, 25 కేజీల సన్నబియ్యాన్ని పంపిణీ చేసి, ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. […]

Read More
హల్దీవాగులోకి కొండపోచమ్మ నీళ్లు

హల్దీవాగులోకి కొండపోచమ్మ నీళ్లు

సారథి, గజ్వేల్: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేయాలనే తలంపులతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యాచరణ కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మెడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరాయి. మంగళవారం కొండపోచమ్మ సాగర్ నీళ్లను మొదట హల్దివాగులోకి విడుదల చేశారు. మంజీరా నది ద్వారా నిజాంసాగర్ కు తరలించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ […]

Read More
తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు

తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల మూసివేత తాత్కాలికమేనని, విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎం కె.చంద్రశేఖర్​రావు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలు బలమైన సలహాలు, సూచనలు ఇవ్వడం లేదన్నారు. ప్రతి విషయాన్ని విమర్శించడం సరికాదని, మూస ధోరణిలో […]

Read More